Akhil : సిసింద్రీని "లెనిన్" లేపుతుందట.. అంత నమ్మకం ఎందుకంటే?

అక్కినేని వారి ఇంట ఫెయిల్యూర్ హీరో ఎవరైనా ఉన్నారంటే అఖిల్ అని చెప్పాలి.

Update: 2025-05-14 07:09 GMT

అక్కినేని వారి ఇంట ఫెయిల్యూర్ హీరో ఎవరైనా ఉన్నారంటే అఖిల్ అని చెప్పాలి. పాపం.. అఖిల్ కు ఎంట్రీ సమయం నుంచి మంచి హిట్ దొరకలేదు. విజయం లభించలేదు. అదే అక్కినేని ఫ్యాన్స్ కు కొరత. నాగార్జున అరవై ఏళ్లు దాటినా అప్పుడప్పుడూ హిట్ కొడుతున్నారు. ఇక నాగచైతన్య కూడా మంచి హిట్స్ ను అందుకుంటున్నాడు. కానీ అఖిల్ మంచి అందగాడు అయి, యాక్టర్ గా మంచి ఫిజిక్ ఉన్నప్పటికీ, లక్షలాది మంది ఫ్యాన్స్ ఉన్నా, సిల్వర్ స్క్రీన్ పై యాక్షన్ తో విరుచుకుపడుతున్నా బాక్సాఫీసు వద్ద మాత్రం సక్సెస్ కావడం లేదు. ఎంత మంది డైరెక్టర్లను మార్చినా, ఎన్ని కథలతో సినిమాలు చేసినా ఆశించిన రీతిలో అఖిల్ ఆశించినంత విజయాలను అందుకోలేకపోతున్నాడు.

లెనిన్ పై అంచనాలు...
ఏ మూవీ పట్టుకున్నా డిజాస్టర్ లు అయి కూర్చున్నాయి. అఖిల్ లో లోపమా? అంటే కానే కాదు. డైరెక్టర్లు కూడా తమ శక్తిమేరకు కృషి చేస్తున్నా కూడా ప్రేక్షకులు ఆదరించలేదు. ఇలా అఖిల్ టాలీవుడ్ లోనే ఫెయిల్యూర్ హీరోగా ముద్రపడిపోయారు. అయితే తాజాగా అఖిల్ నటిస్తున్న లెనిన్ పై మాత్రం కొంత అంచనాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఈ మూవీకి మురళీ కిషోర్ అబ్బూరి దర్శకత్వం వహిస్తున్నారు. అఖిల్ కు జంటగా ఈ సినిమాలో శ్రీలీల నటిస్తుంది. మంచి పాటలతో పాటు యాక్షన్ మూవీగా తెరకెక్కిస్తున్నారు. పేరును చూస్తే లెనిన్ అనిపిస్తున్నా కామెడీతో పాటు యాక్షన్, మంచి కథతో ఈ మూవీ ప్రేక్షకులకు ముందు వస్తుందని అని చెబుతున్నారు.
ఫ్యాన్స్ ను కట్టిపడేసేలా...
లేటెస్ట్ గా లెనిన్ మూవీపై లేటెస్ట్ అప్డేట్ వచ్చేసింది. లెనిన్ మూవీ షూటింగ్ పూర్తి కావస్తుంది. శరవేగంగా జరుపుకుంటుంది. సితార ఎంటర్ టైన్ మెంట్స్ తో పాటు అన్నపూర్ణ స్డూడియోస్ ఈ మూవీ నిర్మిస్తుంది. అయితే లెనిన్ మూవీ ఎప్పుడొస్తుందని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. లెనిన్ మూవీ ఈ ఏడాది నవంబరు 14వ తేదీన విడుదలకు సిద్ధమవుతుందని తెలిసింది. మాస్ తో పాటు క్లాస్ అభిమానులను కూడా కట్టిపడేసేలా ఈ మూవీని రూపొందిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. సంగీతం కూడా ఆకట్టుకునేలా సాగుతుందని చెబుతున్నారు. సిసింద్రీకి ఈ లెనిన్ తో నైనా మంచి హిట్టు పడుతుందని అక్కినేని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
Tags:    

Similar News