Allu Arjun : బన్నీ ఫ్యాన్స్ కు మంచి న్యూస్.. రిలీజ్ డేట్ అప్పుడేనటగా?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ గా మారారు. పుష్ప మూవీతో ఆయన రేంజ్ ఎక్కడికో వెళ్లిపోయింది.

Update: 2025-06-01 07:02 GMT

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ గా మారారు. పుష్ప మూవీతో ఆయన రేంజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. అభిమానులు కూడా బన్నీ మూవీ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. మంచి ఫీల్, ఈజ్ తో పాటు సాంగ్స్, స్టెప్స్, ఫైట్స్ ఇలా పంచభక్ష పరమాన్నాలతో కూడిన భోజనం అందించే బన్నీ మూవీ అంటే కేవలం ఫ్యాన్స్ మాత్రమే కాదు.. సాధారణ ప్రేక్షకులు కూడా ఈగర్ గా వెయిట్ చేస్తుంటారు. బన్నీ పై ఎన్ని ట్రోల్స్ అవుతున్నా సరే చివరకు ఆయన సినిమాను మాత్రం థియేటర్ లో చూస్తేనే ఫీల్ ఉంటుందని భావిస్తారు.

తాను అనుకున్నది ...
అందుకే పుష్ప సినిమా విడుదల సందర్భంగా సంథ్య థియేటర్ లో అంత తొక్కిసలాట జరిగింది. ఇక అలా ఉంచితే తాజాగా బన్నీ ధరించిన బనియన్ పై నెల్లూరు పెద్దారెడ్డి తాలూకు అని ఉండటం కూడా విమర్శలకు తావిచ్చింది. సోషల్ మీడియాలో కొందరు పనిగట్టుకుని అల్లు అర్జున్ కు వ్యతిరేకంగా ప్రచారం చేశారు. కానీ అల్లు అర్జున్ మాత్రం తాను చేయాలనుకున్న పనిచేస్తారు. తనకు ఏది మంచిది అనిపిస్తే దాని వైపు వెళ్లడం అల్లు గారి అబ్బాయి నైజం. ఇక అల్లుఅర్జున్ తాజాగా నటిస్తున్న లేటెస్ట్ మూవీపై కూడా ఒక వార్త వైరల్ అవుతుంది.
లేటెస్ట్ మూవీపై...
అల్లు అర్జున్ నటిస్తున్న, అట్లీ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న మూవీని సన్ పిక్చర్స్ నిర్మిస్తుంది. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే అనేక విషయాలు వైరల్ అవుతున్నాయి. విజువల్ ఎఫెక్ట్ కోసం హాలీవుడ్ స్టూడియోలతో అగ్రిమెంటు కుదిరిందంటున్నారు. ఇక ఈ సినిమా షూటింగ్ ఈ నెల 5వ తేదీ నుంచి ప్రారంభం కానుందని తెలిసింది. ప్రీ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతుండటంతో ఇక ఫస్ట్ షెడ్యూల్ లో అల్లు అర్జున్ పాల్గొంటారని వార్తలు వస్తున్నాయి. దీనికి సంబంధించిన కథ, మ్యూజిక్ పై ఎలాంటి అప్ డేట్ లేకపోయినా పేరు మాత్రం బయటకు వచ్చింది. ఐకాన్ లేదా సూపర్ హీరో పేర్లను నిర్మాతలు, దర్శకుడు పరిశీలిస్తున్నట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మరి రిలీజ్ అనేది బహుశ దసరాకు ఉండే అవకాశముంటుందని కూడా అంటున్నారు. మరి నాలుగైదు నెలల్లో మూవీ పూర్తవుతుందా? అన్నది అనుమానమే. దసరాకు కాకుంటే దీపావళికి గ్యారంటీ అని చెబుతున్నారు.



















Tags:    

Similar News