ఫుల్ ఫైర్ అయిన హైపర్ ఆది

మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన భోళా శంకర్ సినిమా ఆగస్టు 11న రాబోతోంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో

Update: 2023-08-06 17:17 GMT

మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన భోళా శంకర్ సినిమా ఆగస్టు 11న రాబోతోంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హైపర్ ఆది ప్రసంగం వైరల్ అవుతోంది. నా దృష్టిలో సచిన్, చిరంజీవి ఒక్కరే.. క్రికెట్‌లో విమర్శలు వస్తే.. సచిన్ బ్యాటింగ్‌తో సమాధానం ఇస్తాడు.. సినిమాల్లో విమర్శలు వస్తే.. చిరంజీవి గారు సినిమాలతోనే సమాధానం ఇస్తారు..ఆచార్యతో విమర్శలు, వాల్తేరు తో సమాధానం చెప్పారు.. అలాగే ఇప్పుడు భోళా శంకర్ కూడా అంతకు మించి ఉంటుందని చెప్పుకొచ్చారు. ఈ తరం హీరోల డ్యాన్స్, ఫైట్లు, రెమ్యూనరేషన్ల గురించి మాట్లాడుతుంటారు.. కానీ వాటన్నంటిలో మార్క్ సెట్ చేసింది చిరంజీవి గారు..బిగ్గర్ దెన్ బచ్చన్ అని ఉంటుంది చదువుకోండి.. పది కోట్లు కలెక్ట్ చేసిన ఘరానా మొగుడు గురించి తెలుసుకోండి.. ఇక్కడున్న వాళ్లందరికీ ఊహ తెలియక ముందే.. ఊహించని రికార్డులు క్రియేట్ చేసిన స్టార్ మెగాస్టార్ అని అన్నారు. చిరంజీవి గారి వారసుడు రామ్ చరణ్.. చిరుత చిత్రం ద్వారా అరంగేట్రం చేసిన సమయంలో ఎంతో మంది ఇష్టం వచ్చినట్లు అన్నారు. హిట్ అయితే దర్శకుడి వల్ల అని.. ఫ్లాప్ అయితే రామ్ చరణ్ వల్లే అనేవారు. కానీ రంగస్థలం సినిమాతో అందరూ కామ్ అయ్యారు. సచిన్ కొడుకు సచిన్ కాలేదు.. అమితాబ్ బచ్చన్ కొడుకు అమితాబ్ కాలేదు.. కానీ చిరంజీవి కొడుకు చిరంజీవి అయ్యాడు.. కొణిదెల వెంకట్రావ్‌కి కొణిదెల చిరంజీవి ఎంత పేరు తెచ్చి పెట్టాడో.. కొణిదెల చిరంజీవికి కొణిదెల రామ్ చరణ్ అంతకంటే ఎక్కువ పేరు సంపాదించాడని అన్నారు.

ఆయనకు ఠాగూర్ సినిమాలో నచ్చని పదం క్షమించడం.. కానీ నిజ జీవితంలో అందరినీ క్షమిస్తూనే ఉంటాడు.. ప్రచారానికి వెళ్తే చిరంజీవి గారి మీద గుడ్డు కొట్టాడు.. ఆయన అక్కడ సైగ చేసి ఉంటే.. అక్కడే ఆ వ్యక్తికి గుండు కొట్టేవారని హైపర్ ఆది చెప్పుకొచ్చారు. కొన్ని వేల మందికి ప్రవచనాలు చెప్పే వ్యక్తి.. చిరంజీవి గారి మీద అసహనం వ్యక్తం చేశారు.. ఎదుటి వాళ్లకి ఎలా ఉండాలని చెపే వ్యక్తి సహనం కోల్పోయాడు.. కానీ చిరంజీవి గారు సహనం కోల్పోలేదన్నారు. వెళ్లి ఆయన పక్కన కూర్చుని ఈవెంట్ సజావుగా జరిగేలా చూశారు. ఓ స్టార్ డైరెక్టర్ ఉన్నాడు. ఆయన్ను అనే అర్హత నాకు లేదు. కానీ ఆయనకు కూడా మెగాస్టార్, పవర్ స్టార్ గారిని అనే అర్హత లేదు. ఓ పెగ్ వేస్తే మెగాస్టార్ గురించి.. ఇంకో పెగ్ వేస్తే పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడతారు.. ఆయనకు అంత అర్హత లేదని అన్నారు.


Tags:    

Similar News