Peddi : పెద్ది మూవీపై మరో బిగ్ అప్ డేట్...ఫస్ట్ సాంగ్ విడుదల అప్పుడేనటగా?

మెగా పవర్ స్టార్ రామచరణ్ నటిస్తున్న పెద్ది మూవీ పై భారీగా అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి.

Update: 2025-07-28 07:40 GMT

మెగా పవర్ స్టార్ రామచరణ్ నటిస్తున్న పెద్ది మూవీ పై భారీగా అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. గేమ్ ఛేంజర్ తర్వాత విడుదలవుతున్న సినిమా కావడంతో ఆ సినిమా యావరేజ్ టాక్ సొంతం చేసుకోవడంతో పెద్ది సినిమాపై మెగా ఫ్యాస్స్ భారీ ఆశలు పెట్టుకున్నారు. మెగా కాంపౌండ్ కు చెందిన మూవీ కావడంతో సూపర్ హిట్ కావడం ఖాయమన్న ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి. అందులోనూ ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు కావడంతో ఇంకా ఫ్యాన్స్ తో పాటు సాధారణ ప్రేక్షకులు కూడా ఈ మూవీ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఎమోషనల్ డ్రామాగా...
బుచ్చిబాబు డైరెక్షన్ లో విడుదలయ్యే ఒక ఎమోషనల్ డ్రామాగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. క్రీడా నేపథ్యంతో సాగే ఈ కథనం అందరినీ ఆకట్టుకునే అవకాశాలున్నాయి. అదే సమయంలో క్రికెట్, కబడ్డీ, కుస్తీ వంటి లోకల్ ఆటల నేపథ్యంలోనూ ఈ సినిమా కొనసాగుతుందన్న లీకులు సినిమాకు మరింత బజ్ ను పెంచాయి. ఇక రామ్ చరణ్ కూడా ఈ సినిమాలో డిఫరెంట్ లుక్ లో కనిపిస్తున్నాడు. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించి విడుదలయిన గ్లింప్స్, రామ్ చరణ్ న్యూ లుక్ తో మరింత హైప్ తెచ్చింది.
వచ్చే నెల 25వ తేదీన...
తాజాగా అందుతున్న సమాచారం మేరకు పెద్ది మూవీ ఫస్ట్ సాంగ్ ను ఈ ఏడాది ఆగస్టు 25వ తేదీన విడుదల చేసేందుకు మేకర్స్ సిద్ధమవుతున్నారని సమాచారం. అయితే మేకర్స్ దీనిపై ఇంకా అధికారిక ప్రకటన చేయకపోయినా త్వరలోనే దీనిపై ప్రకటన వెలువడుతుందని అంటును్నారు. రెహమాన్ సంగీత దర్శకత్వం వహించడంతో ఫస్ట్ సాంగ్ పై కూడా మెగా ఫ్యాన్స్ భారీగా అంచనాలు పెట్టుకున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ కలిపి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం రామ్ చరణ్ డైయిరీలో హిట్ సరసన చేరుతుందంటున్నారు.




Tags:    

Similar News