Raja Saab : మొసళ్లతో థియేటర్స్ కు వచ్చిన ఫ్యాన్స్
ప్రభాస్ నటించిన రాజాసాబ్ మూవీకి ఆయన ఫ్యాన్స్ విన్నూత్న రీతిలో థియేటర్ కు వచ్చారు
ప్రభాస్ నటించిన రాజాసాబ్ మూవీకి ఆయన ఫ్యాన్స్ విన్నూత్న రీతిలో థియేటర్ కు వచ్చారు. సినిమా ట్రైలర్ లో కనిపించిన మొసలిని చూసిన ఫ్యాన్స్ థియేటర్ కు మొసలి బొమ్మలతో రావడం తో అందరూ ఆశ్చర్యంగా చూశారు. మొసలి బొమ్మలతో డార్లింగ్ ఫ్యాన్స్ చేసిన హంగామా అంతా ఇంతా కాదు. రాజా సాబ్ సినిమా ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా విడుదలయింది.
రాజా సాబ్ మూవీలో..
ఈ మూవీ క్లైమాక్స్ లో ప్రభాస్ మొసలితో ఫైట్ చేసే సన్నివేశం అందరినీ ఆకట్టుకుందని అంటున్నారు. దీంతో అభిమానులు కూడా మొసలి బొమ్మలతో థియేటర్లకు వచ్చిఫైట్ చేసే సమయంలో స్క్రీన్ వైపు కు దూసుకెళ్లారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో మొసలి బొమ్మలతో థియేటర్ కు వచ్చిన వీడియోలు వైరల్ గా మారాయి. ప్రభాస్ ఫ్యాన్సా.. మజాకా? అని నెట్టింట కామెంట్స్ వినిపిస్తున్నాయి.