హానీరోజ్‌ ఫస్ట్‌లుక్‌ రిలీజ్‌.. మరీ ఇంత వైల్డ్‌గానా?

'వీరసింహారెడ్డి' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది మలయాళ నటి హనీ రోజ్‌. బొద్దుగా ఉన్న హనీరోజ్ తన అందం, నటనతో ఎంతగానో

Update: 2023-07-16 12:48 GMT

'వీరసింహారెడ్డి' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది మలయాళ నటి హనీ రోజ్‌. బొద్దుగా ఉన్న హనీరోజ్ తన అందం, నటనతో ఎంతగానో ఆకట్టుకుంది. ఈ సినిమాలో హనీరోజ్‌ గ్లామరస్‌ రోల్‌ చేయకపోయినా.. సినిమా రిలీజ్‌ తర్వాత ఆమె లుక్స్‌, కాస్ట్యూమ్స్‌ కుర్రాళ్లకు కిక్‌ ఇచ్చాయి. ఈ సినిమా తర్వాత హనీరోజ్‌ తెలుగులో మరో సినిమా చేయలేదు కానీ.. బిజినెస్‌ యాడ్స్‌, ఓపెనింగ్స్‌లో పాల్గొంది. ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే హనీరోజ్‌.. రాచెల్ (తెలుగులో రాహేలు) అనే సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాలో ఆమె ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్‌ను చిత్రయూనిట్‌ తాజాగా రిలీజ్‌ చేసింది. ఎవ్వరూ ఊహించని పాత్రలో, మరీ వైల్డ్‌గా హనీ రోజ్ అందరికీ షాకిచ్చింది.

ఓ బీఫ్ షాపులో హనీరోజ్‌ మాంసం కొడుతున్న లుక్‌ అందరినీ ఆకట్టుకుంటోంది. మోడ్రన్ డ్రెస్సులో మాంసం కొడుతున్న ఫొటోను హనీరోజ్ తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేసింది. విజువల్స్‌లో ఆమె చుట్టూ దున్నపోతు తలకాయలు ఉన్నాయి. సీరియస్‌ లుక్‌లో కత్తి పట్టుకుని హానీరోజ్‌ వైల్డ్‌గా కనిపిస్తోంది. పోస్టర్లను చూస్తుంటే.. ఇది చాలా బోల్డ్ సినిమాలా కనిపిస్తోంది. పాన్ ఇండియా చిత్రంగా ఇది తెలుగు తమిళం, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో రిలీజ్ కానుంది. ఆనందిని బాల ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా క్రైమ్‌ థ్రిల్లర్‌ నేపథ్యంలో తెరకెక్కిస్తున్నట్టు సమాచారం. 

Tags:    

Similar News