అజిత్ కు మరోసారి తప్పిన ప్రమాదం

హీరో అజిత్‌కు మరోసారి ప్రమాదం జరిగింది. స్పెయిన్ లో కార్ రేసింగ్ లో పాల్గొంటున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది

Update: 2025-02-23 07:31 GMT

హీరో అజిత్‌కు మరోసారి ప్రమాదం జరిగింది. స్పెయిన్ లో కార్ రేసింగ్ లో పాల్గొంటున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో గాల్లో కారు పల్టీలు కొట్టింది. ఈ వీడియో వైరల్ కావడంతో అభిమానుల్లో ఆందోళన నెలకొంది. అయితే ఈ ప్రమాదంలో అజిత్ కు ఎటువంటి గాయాలు తగలలేదు. కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ ఈ మధ్యన కార్ రేసింగుల్లోనూ పాల్గొంటున్నారు. ఓవైపు హీరోగా సినిమాలు చేస్తూనే మరోవైపు బైక్, కార్ రేసింగుల్లో పాల్గొంటారు. కార్ రేసింగ్ ల్లో పాల్గొనడం అజిత్ కు హాబీ.

కార్ రేసింగ్ లో....
మొన్నా మధ్య జరిగిన ప్రమాదం నుంచి అజిత్ తృటిలో తప్పించుకున్నారు. తాజాగా కూడా ప్రమాదం జరగడం, అయితే అజిత్ వరుసగా ప్రమాదాల బారిన పడడం అభిమానులను ఆందోళనకు గురి చేస్తోంది. స్పెయిన్‌లో జరుగుతున్న రేసింగ్‌లో ఆయన కారు ప్రమాదానికి గురైంది. మరో కారును తప్పించే క్రమంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. దీంతో అజిత్ వాహనం ట్రాక్‌పై పల్టీలు కొట్టింది. ప్రమాదం జరిగిన వెంటనే అజిత్ తన కారు నుంచి క్షేమంగా బయట పడినట్లు వీడియోలో కనిపించింది. అజిత్ కు ఎలాంటి గాయలు కాకపోవటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.


Tags:    

Similar News