"గుప్పెడంత మనసు" సీరియల్ హీరో రిషి ఇంట తీవ్రవిషాదం

రిషి- వసు జంట అంత బాగుంటుంది. వీళ్ల ఒరిజినల్ నేమ్స్ అంతగా తెలియకపోవచ్చు కానీ.. రిషి- వసు అంటే వెంటనే గుర్తుపడతారు.

Update: 2023-05-23 13:28 GMT

mukhesh gowda father

గుప్పెడంత మనసు..ఈ సీరియల్ గురించి తెలియని యువత ఉండదు. ఈ సీరియల్ లో హీరో - హీరోయిన్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ కాస్త ఎక్కువే. ఇద్దరి మధ్య ఉండే ప్రేమను బుల్లితెరపై ఎంతో అందంగా చూపించడం వల్లే ఈ సీరియల్ హిట్ అవుతోంది. రిషి- వసు జంట అంత బాగుంటుంది. వీళ్ల ఒరిజినల్ నేమ్స్ అంతగా తెలియకపోవచ్చు కానీ.. రిషి- వసు అంటే వెంటనే గుర్తుపడతారు. తాజాగా.. ఈ సీరియల్ హీరో ముఖేష్ గౌడ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. కొన్నేళ్లుగా పక్షవాతంతో బాధపడుతూ.. ఇంటివద్దే చికిత్స పొందుతున్న ముఖేష్ తండ్రి మరణించారు. ముఖేష్ కు పితృవియోగం కలిగింది. తండ్రి మరణవార్త వినగానే ముఖేష్ గౌడ షూటింగ్ మధ్యలోనే వెళ్లిపోయారు.

ముఖేష్ గౌడ కన్నడ నటుడు. ప్రేమనగర్ అనే సీరియల్ తో తెలుగు బుల్లితెరకు పరిచయమయ్యాడు. ఆ తర్వాత కుమార్ దర్శకత్వం వహిస్తోన్న గుప్పెడంత మనసు సీరియల్ తో బాగా ఫేమస్ అయ్యాడు. ఇటీవల ఓ టీవీ షో లో నిర్వహించిన ఈవెంట్ కు తన తండ్రిని తీసుకువచ్చి అందరికీ పరిచయం చేశారు. తన తండ్రిని తాను తనకే పుట్టిన కొడుకులా చూసుకుంటానని, పక్షవాతం కారణంగా మంచానికే పరిమితమైన ఆయనకు అన్ని సేవలు చేస్తూ.. తృప్తి చెందుతానని తెలిపారు.


Tags:    

Similar News