మంచు విష్ణు ఆఫీసులో జీఎస్టీ అధికారుల తనిఖీలు

టాలీవుడ్ హీరో మంచు విష్ణు కార్యాలయంలో జీఎస్టీ అధికారులు సోదాలు నిర్వహించారు

Update: 2025-06-25 14:19 GMT

టాలీవుడ్ హీరో మంచు విష్ణు కార్యాలయంలో జీఎస్టీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ నెల 27వ తేదన కన్నప్ప విడుదలవుతున్న నేపథ్యంలో ఈ సోదాలు జరిగినట్లు తెలిసింది. మాదాపూర్ లోని ఆయన కార్యాలయంలో జీఎస్టీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. అలాగే ఈ సినిమా వంద కోట్ రూపాయలు పైన వ్యయం దాటడంతో దానికి సంబంధించి జీఎస్టీ చెల్లింపులపై రికార్డులను పరిశీలిస్తున్నారు.

జీఎస్టీ చెల్లింపులపై...
ఖర్చు చేసిన మొత్తానికి లెక్క ప్రకారం జీఎస్టీ చెల్లించారా లేదా? అన్నది పరిశీలిస్తున్నారు. జీఎస్టీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్న విషయం తెలుసుకుని మోహన్ బాబు అక్కడకు చేరుకున్నారు. మంచు విష్ణు మాత్రం జీఎస్టీ తనిఖీల విషయం తనకు తెలియదని, అయినా లెక్కలు పక్కాగా ఉన్నాయని చెప్పారు. తాను సినిమా విడుదల హడావిడిలో ఉన్నామని చెప్పారు.


Tags:    

Similar News