హీరో నాగార్జునకు నోటీసులు

హీరో నాగార్జునకు గోవాలోని మాండ్రెమ్ పంచాయతీ నోటీసులు జారీ చేసింది

Update: 2022-12-22 03:27 GMT

హీరో నాగార్జునకు గోవాలోని మాండ్రెమ్ పంచాయతీ నోటీసులు జారీ చేసింది. అక్కడ నిర్మిస్తున్న కట్టడాల విషయంపై అభ్యంతరం తెలుపుతూ ఈ నోటీసులు జారీ అయ్యాయి. అక్రమ నిర్మాణం జరుగుతుందని నోటీసుల్లో పేర్కొననారు. గోవాలోని మాండ్రెమ్ పంచాయతీలోని అశ్వవాడ గ్రామ పరిధిలోని సర్వే నెంబరు 211/2Bలో అక్రమ కట్టడాలు నిర్మిస్తున్నారని నోటీసుల్లో పేర్కొన్నారు.

అక్రమ కట్టడాలను...
అక్రమ కట్టడాలను నిర్మిస్తున్న కారణంగా గోవా పంచాయతీ రాజ్ చట్టం 1994 కింద ఈ నోటీసులు జారీ అయ్యాయి. పనులు వెంటనే నిలిపి వేయలేకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నోటీసులకు నాగార్జున సమాధానం చెప్పాల్సి ఉంటుంది. వెంటనే పనులను నిలిపేయాల్సి ఉంటుంది.


Tags:    

Similar News