మురిసిపోతున్న "మెగా" ఫ్యాన్స్.. ఇంతటి అప్ డేట్ వస్తే ఇంతకంటే కావాల్సిందేముంటుంది?
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందుతున్న పెద్ది మూవీ చిత్రం షూటింగ్ లో బిజీగా ఉన్నారు.
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందుతున్న పెద్ది మూవీ చిత్రం షూటింగ్ లో బిజీగా ఉన్నారు. మధ్యలో చిన్న బ్రేక్ ఇచ్చినా ఈ మూవీ తిరిగి షూటింగ్ ప్రారంభమయింది. పెద్ది మూవీపై భారీ అంచనాలు వినిపిస్తున్నాయి. అయితే పెద్ది సినిమా తర్వాత రామ్ చరణ్ ఎవరితో మూవీ చేయబోతున్నారన్న దానిపై కూడా ఇది వరకే క్లారిటీ వచ్చింది. రామ్ చరణ్ - సుకుమార్ కాంబినేషన్ లో మూవీకి అంతా సిద్ధమయిందని తెలిసింది. రామ్ చరణ్ ఈ మూవీ ఆర్ సి 17 గా ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
పుష్ప 3 సీక్వెల్ ను...
పుష్ప 3 సీక్వెల్ ను చేస్తారనుకున్న సుకుమార్ ఆ ప్రాజెక్టును కొంత కాలం పక్కన పెట్టారు. అల్లు అర్జున్ కూడా ఇతర దర్శకుల సినిమాల్లో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో రూపొందుతున్న మూవీలో అల్లు అర్జున్ నటిస్తున్నారు. అది పూర్తయిన వెంటనే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ చేసే అవకాశముంది. అందుకే సుకుమార్ తన నెక్ట్స్ ప్రాజెక్టును రామ్ చరణ్ తో చేయాలని డిసైడ్ అయ్యారు. అల్లు అర్జున్ ను వెనక్కు నెట్టి.. రామచరణ్ తో ప్రాజెక్టును సుకుమార్ ప్రారంభించారు.
స్క్రిప్ట్ వర్క్ పూర్తవతుందని...
తాజాగా సుకుమార్ తన స్వగ్రామం చేరుకున్నప్పుడు దీనికి సంబంధించిన అప్ డేట్ కూడా ఇచ్చేశారు. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన రంగస్థలం మూవీ సూపర్ డూపర్ హిట్ కావడంతో పాటు పుష్ప రెండు భాగాలు పాన్ ఇండియా సినిమాలుగా అన్ని రికార్డులను బ్రేక్ చేయడంతో ఈ మూవీపై హోప్స్ మామూలుగా లేవు. సుకుమార్ కథ తయారీలో ఉన్నారని చెబుతున్నారు. స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసే పనిలో ఉన్నామని, ప్రీ పొడక్షన్ పనులు కూడా వేగంగా జరుగుతుందని సుకుమార్ వెల్లడించడంతో మెగా అభిమానులు మురిసిపోతున్నారు.