Ghati Movie Collections :

ఘాటి సినిమాకు అపూర్వ స్పందన కనిపిస్తుంది. మౌత్ టాక్ పాజిటివ్ గా రావడంతో కలెక్షన్లలో ఘాట్ మూవీ దూసుకుపోతుంది

Update: 2025-09-07 06:12 GMT

ఘాటి సినిమాకు అపూర్వ స్పందన కనిపిస్తుంది. మౌత్ టాక్ పాజిటివ్ గా రావడంతో కలెక్షన్లలో ఘాట్ మూవీ దూసుకుపోతుంది. అంచనాలు లేకుండా విడుదలయిన ఘాటీ మూవీని ప్రేక్షకులు అనూహ్య రీతిలో ఆదరించారు. విడుదలయిన మూడో రోజు కూడా హౌస్ ఫుల్ కనెక్షన్స్ తో ఘాటీ మూవీ నడుస్తుంది. ఇంతగా హిట్ అవ్వడానికి ఈ చిత్రంలో ఉన్న కథ, కథనం, స్క్రీన్ ప్లే తో పాటు యాక్షన్ సీన్స్, డ్రామా కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుందని చెబుతున్నారు. అందుకే ఎటువంటి ఆర్భాటంగా థియేటర్లలో విడులయిన ఈ చిత్రం సూపర్ డూపర్ హిట్ అయిందన్న టాక్ తెచ్చుకుంది.

అనుష్క నటించిన...
చాలా రోజుల తర్వాత హీరోయిన్ అనుష్క ఇందులో ప్రధాన పాత్ర పోషించారు. క్రిష్ దర్శకత్వంలో రూపొందించిన ఈ సినిమా ఆంధ్రప్రదేశ్ - ఒడిశా సరిహద్దుల్లో ఉన్న ప్రజలకు సంబంధించిన కథ ఆధారంగా తెరకెక్కించడంతో ప్రేక్షకులకు కనెక్ట్ అయిందని చెబుతున్నారు. అందుకే విడుదలయిన రోజు నుంచి ఘాటీ మూవీ పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. నిర్మాతలు కూడా దీనిపై అంచనాలు పెద్దగా లేకుండానే గత శుక్రవారం విడుదల చేసినప్పటికీ మూవీ చూసిన వారు ఎవరూ డిజప్పాయింట్ కావడం లేదని, థియేటర్లలో చూస్తే ఆ ఫీల్ బాగా ఉంటుందన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతుంది.
రెండు రోజుల కలెక్షన్లు...
భారీ ప్రీ-రిలీజ్ హైప్ ఉన్నప్పటికీ, అనుష్క శెట్టి ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన యాక్షన్ డ్రామా ‘ఘాటి’. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో మంచి స్పందననే అందుకుంది. ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం, ఈ చిత్రం మొదటి రోజు దాదాపు రెండు కోట్ల రూపాయలు వసూలు చేయగా, రెండో రోజు కలెక్షన్లు1.75 కోట్లు వచ్చిందని చెబుతున్నారు. అయితే నిమజ్జనం రోజు కావడంతో థియేటర్లకు పెద్దగా ప్రేక్షకులు వచ్చి ఉండరన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఈరోజు నుంచి కలెక్షన్లు ఊపందుకుంటాయన్న అంచనాలు వినిపిస్తున్నాయి. నిర్మాతలు కూడా అదే అభిప్రాయంలో ఉన్నారు. చూడలి మరి అగ్ర కథానాయలకు ధీటుగా ఈ మూవీ ఏమేం రికార్డులను బ్రేక్ చేస్తుందో?


Tags:    

Similar News