గని ప్రీ రిలీజ్ డేట్ ఫిక్స్.. గెస్ట్ గా అల్లు అర్జున్

తాజాగా గని ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్, వేదికను ప్రకటించారు మేకర్స్. ఏప్రిల్ 2వ తేదీన విశాఖపట్నంలో సినిమా ప్రీ రిలీజ్..

Update: 2022-03-29 12:53 GMT

హైదరాబాద్ : అల్లు బాబీ - సిద్ధు ముద్ద సంయుక్తంగా నిర్మించిన సినిమా గని. కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో వరుణ్ తేజ్ హీరోగా నటిస్తుండగా.. సయీ మంజ్రేకర్ కథానాయికగా తెలుగుతెరకు పరిచయం కానుంది. బాక్సింగ్ నేపథ్యంతో ముడిపడిన ఫ్యామిలీ ఎమోషన్స్ తో ఈ సినిమా నిర్మితమైంది. తమన్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమా ఏప్రిల్ 8వ తేదీన థియేటర్లలో విడుదలయ్యేందుకు రెడీ అవుతోంది.

తాజాగా గని ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్, వేదికను ప్రకటించారు మేకర్స్. ఏప్రిల్ 2వ తేదీన విశాఖపట్నంలో సినిమా ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ మేరకు ఓ పోస్టర్ ను విడుదల చేశారు. ఈ వేడుకకు ఐకాన్ స్టార్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా విచ్చేయనున్నారు. "గని" లో జగపతిబాబు, సునీల్ శెట్టి, ఉపేంద్ర, నదియా, నవీన్ చంద్ర తదితరులు ముఖ్య పాత్రల్లో నటించగా.. తమన్నా స్పెషల్ సాంగ్ లో మెరవనుంది.



Tags:    

Similar News