కోట అంత్యక్రియలు నేటి మధ్యాహ్నం
ప్రముఖ సినీనటుడు కోట శ్రీనివాసరావు అంత్యక్రియలు ఈరోజు మధ్యాహ్నం 3.30 గంటలకు జరగనున్నాయి
ప్రముఖ సినీనటుడు కోట శ్రీనివాసరావు అంత్యక్రియలు ఈరోజు మధ్యాహ్నం 3.30 గంటలకు జరగనున్నాయి. మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కోట శ్రీనివాసరావు మరణ వార్త తెలిసిన వెంటనే సినీ ప్రముఖులు ఆయన ఇంటి వద్దకు చేరుకుని భౌతిక కాయానికి నివాళులర్పించారు.
సినీ ప్రముఖులు వచ్చి...
కోట శ్రీనివాసరావుతో తమ అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు. బ్రహ్మానందం, రాజేంద్ర ప్రసాద్, దగ్గుబాటి సురేష్, తనికెళ్ల భరణి వంటి నటులు కోట శ్రీనవాసరావు ఇంటికి వచ్చి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. కోట శ్రీనివాసరావు విలక్షణ నటుడని, ఆయన మరణంతో చిత్ర పరిశ్రమ పెద్దదిక్కును కోల్పోయినట్లయిందని తెలిపారు.