అందుకే సలార్ ఆలస్యం.. అధికారిక ప్రకటన వచ్చేసింది

పాన్-ఇండియన్ స్టార్ ప్రభాస్ 'సలార్', 2023లో భారీ అంచనాలు

Update: 2023-09-13 06:22 GMT

ప్రభాస్ - ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో 'సలార్' సినిమా రూపొందుతోంది. హోంబలే ఫిలిమ్స్ ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. 'కేజీఎఫ్' .. 'కేజీఎఫ్ 2' సినిమాలు వసూళ్ల విషయంలో కొత్త రికార్డులను నమోదు చేశాయి. అదే బ్యానర్ లో ఇప్పుడు 'సలార్' సినిమా తెరకెక్కుతోంది. ఈ నెల 28వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నట్టుగా ఇంతకుముందే ప్రకటించారు. కానీ సినీ అభిమానులకు బ్యాడ్ న్యూస్.. ఆ రోజున థియేటర్లకు ఈ సినిమా రావడం లేదు. కొన్ని కారణాల వలన ఈ సినిమా విడుదల తేదీని వాయిదా వేస్తున్నట్టుగా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. క్వాలిటీ విషయంలో రాజీ లేకుండా ఈ సినిమాను అందించే ప్రయత్నంలో ఆలస్యం జరుగుతోందని తెలిపారు. అర్థం చేసుకోవాలని ఈ ప్రకటన ద్వారా తెలియజేశారు. కొత్త విడుదల తేదీ ఎప్పుడు అనేది ఈ నెల 28లోగా తెలియజేయనున్నారు.

పాన్-ఇండియన్ స్టార్ ప్రభాస్ 'సలార్', 2023లో భారీ అంచనాలు ఉన్న సినిమాలలో ఒకటి. ఈ చిత్రం సెప్టెంబర్ 28న థియేటర్లలో విడుదలవ్వడానికి షెడ్యూల్ చేశారు. గత కొన్ని వారాలుగా సలార్ విడుదల వాయిదా పడినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ విషయాన్ని ఆలస్యంగా సెప్టెంబర్ 13న ప్రొడక్షన్ హౌస్ అయిన హోంబలే ఫిల్మ్స్ ధృవీకరించింది. ఈ చిత్రం కొత్త విడుదల తేదీని త్వరలో ప్రకటించనున్నారు. సెప్టెంబర్ 28న విడుదల చేస్తే భారీగా కలెక్షన్స్ సాధించవచ్చని చిత్ర నిర్మాతలు భావించారు. ఓవర్సీస్ బుకింగ్స్ కు కూడా భారీ స్పందన వచ్చింది. అయితే పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో జాప్యం కారణంగా సినిమా విడుదల వాయిదా పడింది.


Tags:    

Similar News