Tollywood : నేటి నుంచి టాలీవుడ్ లో షూటింగ్ లు బంద్

నేటి నుంచి టాలీవుడ్ లో షూటింగ్ లకు బంద్ కు ఫిలిం ఫెడరేషన్ ప్రకటించింది.

Update: 2025-08-04 01:55 GMT

నేటి నుంచి టాలీవుడ్ లో షూటింగ్ లకు బంద్ కు ఫిలిం ఫెడరేషన్ ప్రకటించింది. తెలుగు ఫిలిం ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఈ మేరకు లేఖను విడుదల చేసింది. కార్మికులకు 30 శాతం వేతనాలను పెంచాలని కోరుతూ ఈ సమ్మెకు దిగనుంది. 30 శాతం వేతనాలను పెంచిన నిర్మాతలకు సంబంధించిన సినిమాలకు మాత్రమే తాము పనిచేస్తామని తెలిపారు.

వేతనాలు పెంచాలని....

గతంలోనూ ఇలాంటి డిమాండ్ వచ్చినప్పుడు సినీ పెద్దలు జోక్యంచేసుకుని సమ్మెను విరమింపచేశారు.అయితే నేటి నుంచి టాలీవుడ్ లో షూటింగ్ లు బంద్ అవుతాయా? లేదా? అన్నది మరికాసేపట్లో తేలనుంది. నిర్మాతల మండలి మాత్రం తాము ప్రస్తుతం ఇస్తున్న వేతనాలపై ఐదు శాతం మాత్రమే పెంచుతామని చెబుతున్నారు. మరి షూటింగ్ లు నిలిచిపోతాయా? కొనసాగుతాయా? అన్నది ఇరువర్గాల చర్చల తర్వాతతేలనుంది.


Tags:    

Similar News