నేనింతే.. అలా అనుకుంటే మీ ఖర్మ
తనపై వస్తున్న విమర్శలకు సినీనటుడు రాజేంద్ర ప్రసాద్ మరోసారి క్లారిటీ ఇచ్చారు
తనపై వస్తున్న విమర్శలకు సినీనటుడు రాజేంద్ర ప్రసాద్ మరోసారి క్లారిటీ ఇచ్చారు. తాజాగా షష్టిపూ్తి సినిమా సక్సెస్ మీట్ లో ఆయన మాట్లాడుతూ తనపై వస్తున్న మీమ్స్ తో పాటు ఆరోపణలకు కూడా సమాధానమిచ్చారు. తన వ్యాఖ్యలను ఆయన సమర్ధించుకున్నారు. తాను కొన్ని ఫంక్షన్లలో చేసిన వ్యాఖ్యలు తప్పుగా కొందరు అర్థం చేసుకుంటున్నారని, అది వారి ఖర్మ అని అన్నారు.
ఎలా అర్థం చేసుకుంటే అలా...
తన వ్యాఖ్యలను ఎలా అర్థం చేసుకోవాలో సంస్కారంపై ఆధారపడి ఉంటుందని తెులిపారు. తనాు ఎప్పుడూ మీడియా అని పిలవనని, ఫ్యామిలీ అని పిలుస్తానని,అందరూ తనను అన్నయ్య అని పిలుస్తారని రాజేంద్ర ప్రసాద్ అన్నారు. తాను తీసుకొచ్చిన యాక్టర్లతో తాను సరదాగా చేసిన సంభాషణలను తప్పుగా అర్ధం చేసుకుంటే అద ివారి ఖర్మ అని అనడంతో తాను ఇలాగే మాట్లాడతానని చెప్పకనే చెప్పారు.