Mahesh Babu : కొండా వ్యాఖ్యలు బాధించాయి
సినీ నటుడు మహేష్ బాబు మంత్రి కొండా సురేఖ కామెంట్స్ ను అభ్యంతరం తెలిపారు
Mahesh babu
సినీ నటుడు మహేష్ బాబు మంత్రి కొండా సురేఖ కామెంట్స్ ను అభ్యంతరం తెలిపారు. కొండా సురేఖ వ్యాఖ్యలు తనకు బాధ కలిగించాయని తెలిపారు.మరో మహిళపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని మహేష్ బాబు అన్నారు. మహిళ మంత్రి వ్యాఖ్యలు వేదనకు గురి చేసేలా ఉన్నాయని ఆయన అన్నారు.
మనోభావాలు దెబ్బతీసేలా?
ఎదుటవారి మనోభావాలు ఎవరూ దెబ్బతీయవద్దని ఆయన కోరారు. సినీ లోకాన్ని సాఫ్ట్ కార్నర్ గా తీసుకుని వ్యాఖ్యలు చేయడం సముచితం కాదని అన్నారు. నిరాధారమైన ఆరోపణలు చేస్తూ ఎదుటి వారి మనోభావాలను దెబ్బతీయడం ఎంతవరకూ సబబని ఆయన ప్రశ్నించారు. మహిళలను అందరినీ సమానంగా గౌరవించాలని మహేష్ బాబు అభిప్రాయపడ్డారు.