'ఎక్స్‌ట్ట్రా ఆర్డినరీ మ్యాన్‌'.. వీర లెవల్లో నితిన్‌ ఫస్ట్‌లుక్‌

నితిన్‌ నటిస్తున్న లేటెస్ట్‌ మూవీకి వక్కంతం వంశీ డైరెక్ట్‌ చేస్తున్నాడు. ఈ సినిమా యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోంది.

Update: 2023-07-23 12:50 GMT

టాలీవుడ్‌ హీరో నితిన్‌ కెరీర్‌ ఒక అడుగు ముందుకు పడుతుంటే.. నాలుగు అడుగులు వెనక్కి అన్నట్లుగా సాగుతుంది. నితిన్‌ని గతంలో వరుస ఫ్లాపులు వెంటాడిన.. ఆ తర్వాత 'ఇష్క్‌', 'గుండెజారి గల్లంతయ్యిందే', 'హర్ట్‌ ఎటాక్‌' వంటి బ్యాక్‌ టు బ్యాక్‌ హిట్లతో ఫామ్‌లోకి వచ్చేశాడు. ఆ వెంటనే మరో రెండు ఫ్లాపులు పడగా.. ఆ తర్వాత రెండేళ్ళకు 'అఆ!' తో తిరిగి హిట్‌ ట్రాక్‌లోకి వచ్చాడు. ఈ సినిమా విజయాన్ని ఎంజాయ్‌ చేసేలోపే మరో మూడు ఫ్లాపులు పడ్డాయి. అఆ! సినిమా తర్వాత మళ్లీ నాలుగేళ్లకు 'భీష్మ;తో మంచి కంబ్యాక్‌ ఇచ్చాడు. ఈ సినిమా నితిన్‌ కెరీర్‌లోనే బిగ్గెస్ట్‌ హిట్‌గా నిలిచింది. ఇలా అందరూ హీరోలకు రోటిన్‌గా నితిన్‌ కెరీర్‌ సాగుతోంది.

ఇదిలా ఉంటే.. నితిన్‌ నటిస్తున్న లేటెస్ట్‌ మూవీకి వక్కంతం వంశీ డైరెక్ట్‌ చేస్తున్నాడు. ఈ సినిమా యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోంది. ఈ సినిమా చిత్రీకరణ కూడా శరవేగంగా జరుగుతోంది. హీరో నితిన్‌, దర్శకుడు వక్కంతం వంశీ.. ఇద్దరూ కూడా ఈ సినిమాపై భారీ ఆశలు పెట్టుకున్నారు. తాజాగా ఈ మూవీ నుండి నితిన్‌ ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ రిలీజ్‌ అయ్యింది. ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌లోనే సినిమా టైటిల్‌ కూడా రిలీజ్‌ చేశారు. 'ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్‌' అనే టైటిల్‌ని ఫిక్స్‌ చేస్తూ నితిన్‌ ఫస్ట్‌లుక్‌ విడుదల చేశారు.

ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌లో నితిన్‌ లుక్‌.. గుబురు గడ్డంతో వీర లెవల్లో ఉంది. అదే పోస్టర్‌లో కింద కూర్చున్న లుక్కులో మాంచి స్టైలిష్‌గా కనిపిస్తున్నాడు. ఆ రెండు లుక్కులో ఏది ఎక్స్ట్రా, ఏది ఆర్డినరీ అనేది సినిమాలో తెలుస్తుంది. ఈ సినిమాను డిసెంబర్‌ 23న రిలీజ్‌ చేస్తున్నట్లు మేకర్స్‌ ప్రకటించారు. యాక్షన్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నితిన్‌ స్మగ్లర్‌గా కనిపించనున్నాడు. శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాను శ్రేష్ఠ్‌ మూవీస్‌ బ్యానర్‌పై ఆదిత్య మూవీస్ & ఎంటర్టైన్మెంట్స్, రుచిర ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌ భాగస్వామ్యంతో సుధాకర్‌ రెడ్డి నిర్మిస్తున్నాడు.

Tags:    

Similar News