విజయ్ దేవరకొండకు మరోసారి నోటీసులు
విజయ్ దేవరకొండకు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు మరోసారి నోటీసులు జారీ చేశారు
విజయ్ దేవరకొండకు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు మరోసారి నోటీసులు జారీ చేశారు. బెట్టింగ్ యాప్స్ కేసులో విజయ్ దేవరకొండపై ఈడీ కేసు నమోదు చేసి విచారణకు రావాలని కోరింది. ఆగస్టు 6వ తేదీన విచారణకు హాజరు కావాల్సిందిగా ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు తొలుత నోటీసులు జారీ చేశారు. అయితే తాను రాలేనని విజయ్ దేవరకొండ తెలిపారు.
రాలేనని చెప్పడంతో...
తాను షూటింగ్ లలో బిజీగా ఉన్నందున ఆరోజు ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు ఎదుటకు హాజరు కాలేనని, మరొక తేదీని తనకు కేటాయించాలని కోరుతూ విజయ్ దేవర్ కొండ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులకు లేఖ రాశారు. దీంతో ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు తాజాగా విజయ్ దేవరకొండను ఆగస్టు 11వ తేదీన విచారణకు రావాలని కోరారు.