శంకరా.. ఆలోచన బాగుంది కానీ.. వచ్చే వారెవరు నాయనా?
వరస ప్లాప్ ల మీదున్న డైరెక్టర్ శంకర్ మళ్లీ మళ్లీ సినిమాలు చేయడానికి రెడీ అవుతున్నారు.
వరస ప్లాప్ ల మీదున్న డైరెక్టర్ శంకర్ మళ్లీ మళ్లీ సినిమాలు చేయడానికి రెడీ అవుతున్నారు. అయితే నిర్మాతలే ఆయనతో సినిమాకు ముందుక వస్తారా? అన్న అనుమానం కలుగుతుంది. శంకర్ వరసగా తీసిన సినిమాలు ప్లాప్ అయ్యాయి. నిర్మాతలు నష్టపోయారు. అందులో నటించిన వారికి కూడా ప్లాప్ లు మూటగట్టుకుని ఇండ్రస్ట్రీలో తమ ఫ్యాన్స్ నుంచి కొంత ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కమల్ హాసన్ తో తీసిన ఇండియన్ 2 బిగ్ డిజాస్టర్ గా నిలిచింది. తెలుగులో రామ్ చరణ్ తో శంకర్ తీసిన గేమ్ ఛేంజర్ ప్లాప్ గా చెర్రీ ఖాతాలో చోటు దక్కించుకుంది.
మూడు ప్రాజెక్టులు సిద్ధమంటూ...
ఇప్పుడు మరో మూడు ప్రాజెక్టులను సిద్ధంగా ఉన్నట్లు శంకర్ ప్రకటించారు. అవి కూడా భారీ ప్రాజెక్టులని చెబుతున్నాడు. ఈ మూడు భారీ ప్రాజెక్టులు పూర్తి కావాలంటే వందల కోట్ల రూపాయలు కావాలని కూడా శంకర్ చెబుతున్నాడు. తాజాగా శంకర్ వేల్పరి తన డ్రీమ్ ప్రాజెక్టు అని అనౌన్స్ చేశాడు. దానిని తీయడానికి నిర్మాతల కోసం శంకర్ వెదుకుతున్నారు. కానీ శంకర్ ను నమ్మి ఎవరు పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వస్తారన్నది మాత్రం అనుమానమే. ఎందుకంటే మినిమం గ్యారంటీ లేని డైరెక్టర్ గా శంకర్ మారడమే అందుకు కారణం.
నటించాలన్నా...
మరొకవైపు గతంలో శంకర్ సినిమాలో నటించాలంటే ఎందరో హీరోలు ముందుకు వచ్చారు. రోబో వంటి హిట్ తీసిన శంకర్ కు తర్వాత ఒక్క హిట్ కూడా పడలేదు. దీంతో శంకర్ పై అగ్రహీరోలకు కూడా నమ్మకం లేదు. దీంతో తమ కెరీర్ లో డిజాస్టర్ మూవీని ఏరి కోరి ఎంచుకోవడం ఎందుకని హీరోలు కూడా సహజంగా ఆలోచిస్తారు. శంకర్ మామూలుగా సినిమా తీయడు. భారీ బడ్జెట్ తో సినిమా తీస్తాడు. శంకర్ తో సినిమా అంటే నిర్మాతలకు నిత్యం టెన్షన్ ఉంటుంది. అలాంటి టాక్ తెచ్చుకున్న శంకర్ దరి చేరేదెవరన్న ప్రశ్నలు ఇప్పుడు అందరిలోనూ కలుగుతున్నాయి. నిర్మాతలతో పాటు హీరోలు కూడా దొరకడం కష్టమైన పరిస్థితుల్లో మరి శంకర్ తన డ్రీమ్ ప్రాజెక్టును ఎలా కంప్లీట్ చేస్తాడన్నది చూడాల్సి ఉంది.