SSMB 29 : వారణాసిని దించేస్తున్నారటగా.. రాజమౌళియా మజాకా?

రాజమౌళి ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబుతో ఒక మూవీ రెడీ అవుతుంది. ఇందుకోసం భారీ సెట్స్ ను ఏర్పాటు చేస్తున్నారు.

Update: 2025-06-19 07:01 GMT

రాజమౌళి సినిమా అంటే కాసుల వర్షం కురిపిస్తుంది. నిర్మాతలుగా వచ్చిన వారు ఎన్ని కోట్లు ఖర్చు చేయడానికి అయినా వెనకాడరు. ఎందుకంటే రిటర్న్స్ కూడా అదే రేంజ్ లో ఉంటాయి. సుదీర్ఘకాలం సినిమా తీసినా హీరో దగ్గర నుంచి టెక్నీషియన్ల వరకూ రాజమౌళి దర్శకత్వంలో పనిచేయడానికి తహతహలాడుతుంటారు. రాజమౌళి సినిమా పూర్తయ్యే లోపు మరో మూడు సినిమాలు సులువుగా పూర్తి చేసే వీలున్నా పేరు కోసం.. ప్రతిష్ట కోసం ఆయన వెంట నడుస్తారు. అందుకే రాజమౌళి తెలుగు చిత్ర పరిశ్రమకే కాదు.. బాలీవుడ్ కు మించి పోయిన దర్శకుడిగా ఎదిగారు. అమరశిల్పి జక్కన్న చెక్కిన శిల్పంలా ఈ జక్కన్న తాను దర్శకత్వం వహించిన సినిమాను తెరకెక్కించే ప్రయత్నం చేస్తారు.

షూటింగ్ ప్రారంభమై..
రాజమౌళి ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబుతో ఒక మూవీ రెడీ అవుతుంది. ఈ సినిమా షూటింగ్ ప్రారంభమయింది. దీనికి సంబంధించి ఒక వార్త వైరల్ గామారింది. ఈ సినిమా కోసం వెయ్యి కోట్ల రూపాయలను వెచ్చించేందుకు సిద్ధమవుతున్నారు. ఎస్ఎస్ఎంబీ 29 పేరిట ఈ చిత్రం షూటింగ్ శరవేగంగాపూర్తి చేసుకుంటుంది. అయితే తాజాగా అందుతున్న సమాచారం మేరకు ఈ సినిమాలో వారణాసికి సంబంధించిన సీన్స్ తీయాల్సి ఉంది. అయితే నిజానికి వారణాసిలోనే సినిమా చిత్రీకరణ జరపాలని చూసినప్పటికీ అక్కడ అనుమతులతో పాటు అనేక రకాలైన ఇబ్బందులు ఎదురవుతాయని భావించిన రాజమౌళి ఆ ఆలోచన ను విరమించుకున్నారు.
యాభై కోట్లతో...
వారణాసిని ఇక్కడే నిర్మించాలని నిర్ణయించారు. వారణాసి నగరాన్ని ఫిలిం సిటీలో నిర్మించేందుకు సిద్ధమయ్యరాట. ఇందుకోసం యాభై కోట్ల ఖర్చుతో ఏకంగా వారణాసి నగరాన్ని నిర్మిస్తున్నారట. ఇందులో వారణాసిలో గంగా ఘాట్ లు, ఆలయంతో పాటు ఆ వీధులన్నింటినీ ఇక్కడ కృత్రిమంగా ఏర్పాటు చేయనున్నారు. పురాతన దేవాలయాలు కూడా ఇందులో రూపుదిద్దుకుంటున్నాయట. ఈ నేపథ్యంలోనే సెట్ పనులను శరవేగంగా చేస్తున్నారని తెలిసింది.వారణాసి నగరంలో షూటింగ్ ఎంత సేపు ఉంటుందో తెలియదు కానీ, అందుకోసం యాభై కోట్ల రూపాయలు వెచ్చించి సెట్స్ వేయాలని నిర్ణయించడం ఇప్పుడు బాలీవుడ్ తో పాటు అన్ని రికార్డులను బ్రేక్ చేసేలా కనిపిస్తుంది. బాలీవుడ్, టాలీవుడ్ లో ఇప్పటి వరకూ ఇంత భారీ బడ్జెట్ సినిమా రూపుదిద్దుకోలేదట. మొత్తం మీద రాజమౌళి ఎస్ఎస్ఎంబీ 29 తో మరో హిస్టరీని క్రియేట్ చేస్తున్నారనే చెప్పాలి.
Tags:    

Similar News