Kalki 2898 AD : 'కల్కి' మూవీ మహాభారతంతో మొదలు.. 2898తో ఎండ్..

'కల్కి' మూవీ కథ ఎలా మొదలవుతుంది..? ఎలా పూర్తి అవుతుంది..? అనేది దర్శకుడు నాగ్ అశ్విన్ తెలియజేసారు.

Update: 2024-02-26 06:31 GMT
Kalki 2898 AD : ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేస్తున్న చిత్రం 'కల్కి'. హాలీవుడ్ స్థాయిలో రూపొందుతున్న ఈ మూవీలో దీపికా పదుకోనె, దిశా పటాని, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ వంటి స్టార్స్ నటిస్తుండడంతో.. సినిమా పై ఓ రేంజ్ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ అంచనాలకు తోడు.. ఈ సినిమాకి సంబంధించిన స్టోరీ లైన్ మరింత హైప్ ని క్రియేట్ చేస్తుంది. హిందూ పురాణాల్లో చెప్పబడిన విష్ణుమూర్తి దశావతారం 'కల్కి' ప్రధాన పాత్రగా ఈ మూవీ రూపొందుతుందట.
కాగా ఈ మూవీకి సంబంధించిన ఏదొక ఆసక్తి వార్త రోజు నెట్టింట వైరల్ అవుతుంది. తాజాగా ఈ సినిమా కథ ఎలా మొదలవుతుంది..? ఎలా పూర్తి అవుతుంది..? అనేది దర్శకుడు నాగ్ అశ్విన్ తెలియజేసారు. కల్కి మూవీ మహాభారతం కథ నుండి మొదలవుతుందట. అక్కడ మొదలైన స్టోరీ.. 2898వ సంవత్సరంలో పూర్తి అవుతుందట. మొత్తం మీద 6000 సంవత్సరాల కథ అంట. ఈమధ్యలో ఏం జరిగింది అనేది ఆడియన్స్ కి చూపించబోతున్నారట. ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.
ఇండియన్స్ మహాభారతం పై ఎంతో ఆసక్తి ఉంటుంది. అలాంటి కథతో ఈ సినిమా మొదలవుతుందని తెలియడంతో కల్కి పై మరిన్ని అంచనాలు క్రియేట్ అయ్యాయి. మరి ఈ అంచనాలను మూవీ టీం ఎలా అందుకుంటుందో చూడాలి. ఇది ఇలా ఉంటే, ఈ సినిమా మొత్తం తొమ్మిది భాగాలుగా రాబోతుంది అనే వార్త కూడా నెట్టింట వైరల్ అవుతుంది. మరి దానిలో ఎంత నిజముందో తెలియాలంటే.. చిత్ర యూనిట్ నుంచి క్లారిటీ రావాల్సిందే. ఇక ఈ మూవీని మే 9న వరల్డ్ వైడ్ గా భారీగా రిలీజ్ చేయబోతున్నారు. ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో కూడా ఈ మూవీ రిలీజ్ కానుందట.
Tags:    

Similar News