కాంతార కి ఊరట..వరాహరూపం పై నిషేధం ఎత్తివేసిన కోర్టు

ఈ సినిమాకి వరాహరూపం మ్యూజికే హైలెట్ గా నిలిచింది. ఆ మ్యూజిక్ కోసం సినిమా చూసినవారు చాలామంది ఉన్నారు.

Update: 2022-11-26 06:05 GMT

varaharoopam original song

రిషబ్ శెట్టి దర్శకత్వంలో అతనే హీరోగా తెరకెక్కించిన కన్నడ సినిమా కాంతారా. చిన్న సినిమాగా వచ్చిన కాంతారా దేశ వ్యాప్తంగా ఘన విజయం సాధించి..ప్రపంచవ్యాప్తంగా 400 కోట్ల వసూళ్లు చేసి.. అందరినీ ఆశ్చర్య పరిచింది. సెప్టెంబర్ 30 విడుదలైన ఈ సినిమా నవంబర్ 24 నుండి ఓటీటీలో స్ట్రీమ్ అవుతోంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫారమ్ ప్రైమ్ వీడియో ఈ సినిమా డిజిటల్ హక్కులను దక్కించుకుంది. కానీ.. ఓటీటీలో ఆడియన్స్ ని కాంతార నిరాశ పరిచింది.

ఈ సినిమాకి వరాహరూపం మ్యూజికే హైలెట్ గా నిలిచింది. ఆ మ్యూజిక్ కోసం సినిమా చూసినవారు చాలామంది ఉన్నారు. కానీ.. ఆ పాటకు వాడిన మ్యూజిక్ తమదంటూ ఓ మలయాళ ప్రైవేట్ మ్యూజిక్ బ్యాండ్ కోర్టులో కేసు వేసింది. దాంతో ఆ మ్యూజిక్ ని వాడొద్దంటూ కోర్టు అప్పటికి నిషేధం విధించి.. విచారణను వాయిదా వేసింది. అప్పటి నుండి ఆ మ్యూజిక్ ని మార్చి సినిమాను ప్రసారం చేశారు. ఓటీటీలో అయినా..ఆ మ్యూజిక్ వస్తుందేమో అని ఎదురుచూసిన ఆడియన్స్ కి నిరాశ ఎదురైంది.
దాంతో.. వరాహరూపం మ్యూజిక్ కావాలంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రెండ్ చేశారు. తాజాగా ఆ కేసు విచారణకు రాగా.. ఈసారి వరాహరూపం మ్యూజిక్ పై ఉన్న నిషేధాన్ని ఎత్తివేస్తూ కాంతార సినిమాకి సపోర్ట్ గా తీర్పునిచ్చింది. త్వరలోనే ఓటీటీలో వరాహరూపం సాంగ్ ని సినిమాకి యాడ్ చేయనుంది చిత్రబృందం. కోర్టు తీర్పుపై కాంతార అభిమానులు హర్షం వ్యక్తం చేశారు.


Tags:    

Similar News