నటుడు చలపతి మృతిపట్ల ప్రముఖుల సంతాపం..
నటుడు బాలకృష్ణ.. చలపతి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్ధించారు. తన తండ్రితో చలపతికి ఉన్న అనుబంధాన్ని..
celebrities condolence
టాలీవుడ్ సీనియర్ నటుడు చలపతిరావు (78) ఆదివారం తెల్లవారుజామున గుండెపోటుతో ఆకస్మిక మరణం చెందారు. ఆయన మరణంతో టాలీవుడ్ లో తీవ్ర విషాదం నెలకొంది. చలపతి మరణానికి చింతిస్తూ సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు. నటుడు బాలకృష్ణ.. చలపతి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్ధించారు. తన తండ్రితో చలపతికి ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుని భావోద్వేగానికి గురయ్యారు. అలాగే.. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు చలపతి మరణంపట్ల సంతాపం తెలియజేస్తూ ట్వీట్ చేశారు. తెలుగు సినీ పరిశ్రమ రెండు రోజుల్లో ఇద్దరు గొప్ప నటులను కోల్పోవడం బాధాకరమని చెప్పారు. చలపతిరావు మృతి సినీ పరిశ్రమకు తీరని లోటు అని అన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలియజేశారు.
"ప్రముఖ నటులు శ్రీ చలపతిరావు గారు కన్నుమూయడం బాధాకరం. వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్ధిస్తున్నాను. ప్రతినాయకుడి పాత్రల్లోనే కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా తనదైన శైలి నటనను చూపించారు చలపతిరావు గారు. నిర్మాతగా మంచి చిత్రాలు నిర్మించారు. శ్రీ చలపతిరావు గారి కుమారుడు.. నటుడు, దర్శకుడు శ్రీ రవిబాబు గారికి, కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను. తెలుగు సినీ పరిశ్రమలో ఒక తరానికి ప్రతినిధులుగా ఉన్న సీనియర్ నటులు ఒక్కొక్కరుగా కాలం చేయడం దురదృష్టకరం" అంటూ హీరో, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ట్వీట్ చేశారు.