Chiranjeevi : మామ నుంచి కోడలి ఉపాసన వరకు.. అరుదైన అవార్డులతో గౌరవం..

ఇటీవల కాలంలో చిరంజీవి కుటుంబంలోని వ్యక్తులు పలు అరుదైన గౌరవాలు అందుకున్నారు. మెగా ఫ్యాన్స్ వాటిని గుర్తు చేసుకుంటూ..

Update: 2024-01-26 06:18 GMT
Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి కళామతల్లికి, ఆ రంగాన్ని నమ్ముకున్న కళాకారులకు ఎన్నో సేవలు చేశారు. ఒక నటుడి గానే కాదు మంచి మనసు ఉన్న వ్యక్తిగా కూడా మెగాస్టార్ అనిపించుకున్నారు. దీంతో అయన గౌరవార్థం ఎన్నో అవార్డులు ఆయనని వరించాయి. పద్మభూషణ్, డాక్టరేట్, రఘుపతి వెంకయ్య.. ఇలా అరుదైన గౌరవాలు అందుకున్నారు. ఇప్పుడు తాజాగా దేశంలో రెండో అతిపెద్ద సివిలైన అవార్డు అయిన 'పద్మవిభూషణ్'ని అందుకున్నారు.
దీంతో మెగా ఫ్యామిలీ అంతా ఫుల్ జోష్ లో ఉన్నారు. కాగా ఇటీవల కాలంలో చిరంజీవి కుటుంబంలోని వ్యక్తులు పలు అరుదైన గౌరవాలు అందుకున్నారు. వాటిని అన్నిటిని గుర్తు చేసుకుంటూ మెగా ఫ్యాన్స్ సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నారు. మరి అరుదైన గౌరవాలు అందుకున్న ఆ మెగా ఫ్యామిలీ మెంబెర్స్ ఎవరో చూసేయండి.
మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ 'ఆర్ఆర్ఆర్' సక్సెస్ తో గ్లోబల్ వైడ్ పాపులారిటీ సంపాదించడం. ప్రఖ్యాతి చెందిన హాలీవుడ్ స్టార్స్ నిలిచే పలు ఇంటర్నేషనల్ ప్లాట్‌ఫార్మ్స్ పై రామ్ చరణ్.. ఇంటర్నేషనల్ సూపర్ స్టార్ అనే ట్యాగ్ ని సంపాదించుకోవడం. ఆస్కార్ కి వెళ్లడం, ఆర్ఆర్ఆర్ కి గాను పలు అంతర్జాతీయ అవార్డులను కూడా అందుకోవడం. అంతేకాదు ఇండియాలో జరిగే ప్రఖ్యాతి సమ్మిట్స్ లో రామ్ చరణ్ పాల్గొని.. మొట్టమొదటి తెలుగు హీరో అనిపించుకోవడం. ఇలా చాలా గౌరవాలు అందుకున్నారు.
ఇక ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 'పుష్ప' సినిమాతో ఇంటర్నేషనల్ లెవెల్ లో పాపులర్ అయ్యారు. తన మ్యానరిజమ్స్ ని ఇంటర్నేషనల్ సూపర్ స్టార్స్ కూడా అనుసరించేలా చేశారు. ఇక ఎన్నో ఏళ్లగా తెలుగు సినీపరిశ్రమకు ఒక కలలా ఉన్న నేషనల్ అవార్డుని అందుకోవడం గొప్ప గౌరవం.
చివరిగా రామ్ చరణ్ సతీమణి ఉపాసన.. వ్యాపారవేత్తగా, సామాజిక కార్యకర్తగా సొసైటీలో ఎంతో పేరుని సంపాదించుకున్నారు. సమాజం పట్ల భాద్యత వహిస్తూ ఆమె చేసే సేవలకుగానూ మహాత్మాగాంధీ అవార్డుని అందుకున్నారు. అన్నిటికంటే 'క్లీంకార'కి జన్మనిచ్చి అమ్మగా గొప్ప గౌరవని తీసుకున్నారు.
Tags:    

Similar News