ఒకే వేదికపై చిరంజీవి-రజనీ కాంత్-కమల్

డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఇండియన్ 2 షూటింగ్ పూర్తి చేసుకుంది

Update: 2024-05-24 15:05 GMT

డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఇండియన్ 2 షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ సినిమా ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాన్ని జూన్ 1న నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. చెన్నైలోని నెహ్రూ స్టేడియంలో ఈ వేడుక అంగరంగ వైభవంగా జరగనుంది. ఈ కార్యక్రమానికి ఇప్పటికే పలువురు ప్రముఖులకు ఇన్విటేషన్ పంపారు. ఆహ్వానం అందుకున్న వారిలో చిరంజీవి, ఆయన కుమారుడు రామ్ చరణ్ కూడా ఉన్నారు. తమిళ నటుడు రజనీకాంత్‌తో కలిసి ఆడియో లాంచ్‌కు వీరిద్దరూ అతిధులుగా హాజరుకానున్నారు.

ఈ చిత్రంలోని మొదటి సింగిల్ 'పారా' ఇప్పటికే విడుదలైంది. అనిరుధ్ రవిచందర్ ఈ చిత్రానికి స్వరాలు సమకూర్చారు. దర్శకుడు శంకర్‌ సినిమాకు అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడంటే అంచనాలు భారీగా ఉన్నాయి. శంకర్ ప్రస్తుతం తెలుగులో రామ్ చరణ్ నటిస్తున్న గేమ్ ఛేంజర్ కోసం పనిచేస్తున్నాడు. అందుకే ఆడియో లాంచ్‌కి రామ్ చరణ్ తండ్రి చిరంజీవిని కూడా ఆహ్వానించారు. శంకర్‌తో కలిసి పని చేసిన రజనీకాంత్ కూడా ఈ కార్యక్రమంలో కనిపించనున్నారు. ఇక ఈవెంట్‌లో కమల్ హాసన్ కూడా భాగమవుతారు కాబట్టి.. ముగ్గురు లెజెండ్స్ ఒకే వేదికపై కనిపించనున్నారు.


Tags:    

Similar News