అమితాబ్ షోలో చిరంజీవి.. ఏం మాట్లాడాడో తెలుసా..?

అమితాబ్ KBC షోలో చిరంజీవి సడన్ గా ప్రత్యక్షమయ్యి బిగ్ బికి బర్త్ డే విషెస్ తెలియజేశాడు.

Update: 2023-10-12 07:13 GMT

భారతీయ చలన చిత్రసీమలో అమితాబ్ బచ్చన్, చిరంజీవి ఇద్దరు లెజెండ్స్ గా ఎదిరిగారు. ఇక ఈ ఇద్దరు కలిసి ఒకే స్క్రీన్ పై కనిపిస్తే అది ఫ్యాన్స్ కి కన్నుల పండుగ అనే చెప్పాలి. గతంలో వీరిద్దరూ కలిసి ‘సైరా’ మూవీలో నటించారు. రియల్ లైఫ్ లో అమితాబ్ ని గురువుగా భావించే చిరంజీవి.. తన సినిమాలో కూడా గురువు పాత్ర ఇచ్చి బిగ్ బికి శిష్యుడిగా కనిపించాడు. ఇక తాజాగా వీరిద్దరూ మళ్ళీ మరోసారి ఒకే స్క్రీన్ పై కనిపించారు. నిన్న (అక్టోబర్ 11) అమితాబ్ బర్త్ డే కావడంతో అందరూ విషెస్ తెలియజేస్తూ వచ్చారు.

ఈక్రమంలోనే చిరంజీవి కూడా తెలియజేశాడు. అయితే అమితాబ్ ని సర్‌ప్రైజ్ చేస్తూ చిరు తన విషెస్ ని తెలియజేశాడు. బాలీవుడ్ లో అమితాబ్ బచ్చన్ ‘కౌన్ బనేగా క్రోర్‌పతి’ (KBC) రియాలిటీ షో చేస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ షోలో చిరంజీవి సడన్ గా ప్రత్యక్షమయ్యి అమితాబ్ కి విషెస్ తెలియజేశాడు. వీడియో కాల్ ద్వారా చిరంజీవి.. అమితాబ్ కి సర్‌ప్రైజ్ ఇచ్చాడు. ఇక ఈ వీడియో కాల్ లో చిరంజీవి ఏం మాట్లాడాడో తెలుసా..?
చిరంజీవి మాటలు..

"ఈ వీడియో ద్వారా ఇలా అమిత్ జీతో మాట్లాడడం చాలా సంతోషంగా ఉంది. ఆయనపై నాకున్న ప్రేమను కొన్ని పదాలలో తెలియజేయడం చాలా కష్టం. అయితే నా చిన్నతనంలో జరిగిన ఒక విషయం మాత్రం చెబుతాను. 1975లో నా పుట్టినరోజు నాడు మా నాన్న నాకు అత్యంత విలువైన బహుమతి ఇచ్చారు. అమిత్ జీ నటించిన సూపర్ హిట్ మూవీ షోలే టిక్కెట్లను గిఫ్ట్ గా ఇచ్చారు.
అప్పటి నుంచే నేను ఆయనను నా గురువుగా భావిస్తున్నాను. అలాంటి అమిత్ జీ సైరా నాకు గురువుగా నటించడం నేను ఎంతో గౌరవంగా భావిస్తాను. అమిత్ జీ మీకు 81వ పుట్టినరోజు శుభాకాంక్షలు. మీరు ఎల్లప్పుడూ ఆరోగ్యం, ఆనందంతో ఉండాలని కోరుకుంటున్నాను. నాకు ఈ అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు. జై హింద్" అంటూ వ్యాఖ్యానించాడు. ఇక ఈ మాటలకు అమితాబ్ సర్‌ప్రైజ్ అయ్యి చిరుకి థాంక్యూ చెప్పాడు.


Tags:    

Similar News