అదృష్టముంటే అల్లు అర్జున్ తో నటించేయొచ్చు

'పుష్ప: ది రూల్' స్క్రిప్ట్ తుది మెరుగులు దిద్దుకుంటూ ఉందని.. ఆగస్టులో షూటింగ్ ప్రారంభించాలని దర్శకుడు

Update: 2022-07-01 11:37 GMT

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన 'పుష్ప' సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచిన సంగతి తెలిసిందే..! సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రానికి సీక్వెల్ 'పుష్ప ది రూల్' పేరిట రాబోతోంది. పుష్ప సినిమా కోసం ఎలాగైతే కొత్త నటీనటుల కోసం ఆడిషన్స్ మొదలుపెట్టారో.. అలాగే ఈ సినిమా కోసం కూడా కొత్త వారిని వెతుకుతూ ఉన్నారు. ఈ చిత్రం కోసం మైత్రీ మూవీ మేకర్స్ ఆడిషన్స్ ప్రకటించింది. వయసుతో సంబంధం లేకుండా మేల్, ఫిమేల్, చైల్డ్ ఆర్టిస్టులు కావాలంటూ సోషల్ మీడియాలో తెలిపింది. తిరుపతిలో జులై 3, 4, 5 తేదీల్లో నటీనటులకు ఆడిషన్స్ నిర్వహించనున్నట్టు తెలిపింది. తిరుపతి నగరంలోని మేక్ మై బేబీ జీనియస్ స్కూల్ (న్యూ బాలాజీ కాలనీ) వేదికగా నటీనటుల ఎంపిక జరగనుంది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వకు ఆడిషన్స్ ఉంటాయని మైత్రీ మూవీ మేకర్స్ తెలిపింది. ఆడిషన్స్ కు వచ్చేవారికి చిత్తూరు యాస తప్పనిసరి అని స్పష్టం చేసింది. అదృష్టం కలిసి వస్తే అల్లు అర్జున్ పక్కన నటించేయొచ్చు.

'పుష్ప: ది రూల్' స్క్రిప్ట్ తుది మెరుగులు దిద్దుకుంటూ ఉందని.. ఆగస్టులో షూటింగ్ ప్రారంభించాలని దర్శకుడు సుకుమార్ ప్లాన్ చేస్తున్నాడని నివేదికలు చెబుతున్నాయి. అల్లు అర్జున్, ఫహద్ ఫాసిల్ కీలక పాత్రలు పోషించిన మొదటి భాగం భారీ విజయాన్ని సాధించింది. ఈ సినిమా తర్వాత ఉత్తర భారతదేశంలో అల్లు అర్జున్ పాపులారిటీ విపరీతంగా పెరిగింది. సుకుమార్, చిత్ర నిర్మాతలు పుష్ప: ది రూల్ ను కూడా భారీ స్థాయిలో తీర్చిదిద్దడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు.
అల్లు అర్జున్, రష్మిక మందన్న నటించిన పుష్ప: ది రైజ్ 2021లో అతిపెద్ద హిట్‌లలో ఒకటిగా నిలిచింది. తెలుగు సినిమా అయినప్పటికీ హిందీలో కూడా చాలా బాగా ఆడింది. పాటల నుండి డైలాగుల వరకు, సినిమాలోని ప్రతి ఒక్కటీ బాలీవుడ్ ఆడియన్స్ కు నచ్చింది. అల్లు అర్జున్ మేనరిజం చాలా మంది నటులు, క్రికెటర్లు ఇమిటేట్ చేశారు.


Tags:    

Similar News