Prabhas : ప్రభాస్ సినిమాలో సంజయ్ దత్ విలన్‌గా.. ఏ మూవీ..?

ప్రభాస్ సినిమాలో బాలీవుడ్ స్టార్ నటుడు సంజయ్ దత్ విలన్‌గా చేస్తున్నారట. సలార్ మూవీ అనుకుంటున్నారా.. అసలు కాదు.

Update: 2023-12-10 06:44 GMT

Prabhas : రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన 'సలార్' మూవీ మరికొన్ని రోజుల్లో ఆడియన్స్ ముందుకు రాబోతుంది. ఈ సినిమా తరువాత ప్రభాస్ చేతిలో.. కల్కి, దర్శకుడు మారుతీ సినిమా, సందీప్ వంగా 'స్పిరిట్', సలార్ 2 చిత్రాలు ఉన్నాయి. ప్రస్తుతం కల్కి, మారుతీ సినిమాలు సెట్స్ పై ఉన్నాయి. స్పిరిట్ 2024 సెకండ్ హాఫ్ లో సెట్స్ పైకి వెళ్లనుంది. సలార్ 2 షూటింగ్ అప్డేట్ తెలియాల్సి ఉంది. ఇది ఇలా ఉంటే, తాజాగా ప్రభాస్ సినిమాలో విలన్ గురించిన ఓ వార్త నెట్టింట వైరల్ గా మారింది.

బాలీవుడ్ స్టార్ నటుడు సంజయ్ దత్, ప్రభాస్ సినిమాలో విలన్ కనిపించబోతున్నారట. కేజీఎఫ్ తో విలన్ గా సౌత్ లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన సంజయ్ దత్.. ప్రస్తుతం సౌత్ సినిమాల్లో వరుస ఆఫర్లు అందుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు ప్రభాస్ సినిమాలో సంజయ్ దత్ విలన్ అనగానే.. అందరూ సలార్ అనుకుంటున్నారు కదా. కానీ సలార్ సినిమాలో కాదు. మారుతీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో సంజయ్ దత్ విలన్ గా చేయబోతున్నారట.
ఇటీవలే ముంబైలో సంజయ్ దత్ కి లుక్ టెస్ట్ కూడా నిర్వహించారట. ఈ నెల 18 నుంచి సంజయ్ దత్ షూటింగ్ లో జాయిన్ కాబోతున్నారని చెబుతున్నారు. మరి ఈ వార్తలో ఎంత నిజముందో అనేది తెలియాల్సి ఉంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ సినిమాని.. ఇప్పటికి అధికారికంగా లాంచ్ చేయలేదు, ప్రకటించనులేదు. ఈ సినిమాలో మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిధి కుమార్ హీరోయిన్స్ గా కనిపించబోతున్నారట.
ఈ సినిమాకి 'రాజా డీలక్స్' అనే టైటిల్ ని అనుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే ఈ మూవీ హార్రర్ బ్యాక్‌డ్రాప్ లో సాగుతుందట. ఒక పాడుబడిన థియేటర్ చుట్టూ ఈ సినిమా కథ తిరుగుతుందని చెబుతున్నారు. ప్రభాస్ క్యారెక్టర్ చాలా ఫన్ గా ఉంటుందని పేర్కొంటున్నారు. పాన్ ఇండియా లెవెల్ లోనే ఈ చిత్రాన్ని కూడా తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి లీక్ అయిన ప్రభాస్ లుక్స్ ఆడియన్స్ ని ఆకట్టుకున్నాయి. మరి ఈ మూవీని ఎప్పుడు ఆడియన్స్ ముందుకు తీసుకు వస్తారో చూడాలి.


Tags:    

Similar News