బాలీవుడ్ హీరో షారూఖ్ ఖాన్ కు గాయాలు

బాలీవుడ్ హీరో షారూఖ్ ఖాన్ కు గాయాలయ్యాయి. కింగ్ సినిమా షూటింగ్ సమయంలో ఆయనకు గాయాలయినట్లు తెలిసింది

Update: 2025-07-19 08:05 GMT

బాలీవుడ్ హీరో షారూఖ్ ఖాన్ కు గాయాలయ్యాయి. కింగ్ సినిమా షూటింగ్ సమయంలో ఆయనకు గాయాలయినట్లు తెలిసింది. గోల్డ్ టుబాకో స్టూడియోలో ఆయన కింగ్ సినిమా షూటింగ్ చేస్తుండగా ఈ గాయాలయ్యాయి. స్టంట్స్ ను చిత్రీకరించే సమయంలో గాయాలయ్యాయని, కండరాల నొప్పితో బాధపడుతున్న షారూఖ్ ఖాన్ ను వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.

కింగ్ సినిమా షూటింగ్ సమయంలో...
అయితే మెరుగైన చికిత్స నిమిత్తం షారూఖ్ ఖాన్ ను అమెరికాకు తీసుకెళ్లినట్లు తెలిసింది. కింగ్ సినిమా షూటింగ్ సమయంలో యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరిస్తున్నప్పుడు ఈ ప్రమాదం జరిగిందంటున్నారు. ఆయన మరొక నెల రోజుల పాటు విశ్రాంతి తీసుకునే అవకాశముందని తెలిసింది. తిరిగి కింగ్ సినిమా షూటింగ్ అక్టోబరు లేదా నవంబరు నెలలో ప్రారంభమయ్యే అవకాశాలున్నాయని చెబుతున్నారు.


Tags:    

Similar News