ఆ యాడ్ చేసినందుకు షారుఖ్ పై విమర్శలు..

ఆ యాడ్ చేసినందుకు షారుఖ్ తీవ్ర విమర్శలు వస్తున్నాయి. తాజాగా ఆ యాడ్ విషయంలో ఓ NGO సంస్థ షారుఖ్ ఇంటిని ముట్టడించడానికి ప్రయత్నం చేసింది.

Update: 2023-08-29 05:26 GMT

సౌత్ తో నార్త్ చాలామంది స్టార్స్ సినిమాలతో పాటు కమర్షియల్ యాడ్స్ కూడా చేస్తూ కోట్లు సంపాదిస్తుంటారు. అయితే కొంతమంది స్టార్స్ ఆ యాడ్స్ వల్ల ప్రజలకు లాభం కలుగుతుందా..? నష్టం కలుగుతుందా..? అని అలోచించి చేసే వాళ్ళు ఉంటారు. కానీ కొంతమంది మాత్రం ఎటువంటి ఆలోచన లేకుండా ప్రతి యాడ్ ని చేసుకుంటా పోతుంటారు. ముఖ్యంగా బాలీవుడ్ హీరోలు.. పాన్ మసాలా, ఆన్లైన్ గేమింగ్ యాప్స్ అంటూ యువతని పక్కదోవ పట్టించే వాటి కోసం యాడ్స్ చేస్తుంటారు.

ముఖ్యంగా తమ సినిమాల్లో యువతకి మెసేజ్ లు ఇచ్చే.. అక్షయ్ కుమార్ (Akshay Kumar), అజయ్ దేవగన్ (Ajay Devgn), షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan) ఇలాంటి యాడ్స్ చేయడం గమనార్హం. వీళ్ళకి దేశవ్యాప్తంగా ఎంతో ఫాలోయింగ్ ఉంది. చాలా విషయంలో వీరిని అభిమానులు అనుసరిస్తుంటారు. ఒక ఐడల్ పొజిషన్ లో ఉన్న వీరు.. ఇలాంటి యాడ్స్ చేసి ఏం సంపాదిస్తున్నారు అని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఈ విషయం పై ఈ హీరోలు విమర్శలు ఎదుర్కొంటున్నా యాడ్స్ చేయడం మాత్రం ఆపడం లేదు.
తాజాగా ఒక యాడ్ విషయంలో ఓ NGO సంస్థ షారుఖ్ ఇంటిని ముట్టడించడానికి ప్రయత్నం చేసింది. షారుఖ్ ఖాన్ ఒక ఆన్లైన్ రమ్మీ గేమింగ్ యాప్ (Online Rummy Gaming App) కోసం యాడ్ చేశాడు. అది ఎప్పటిదో అయినా ఇప్పుడు మళ్ళీ ప్రసారం అవుతూ ట్రెండ్ అవుతుంది. ఒక స్టార్ హోదాలో ఉన్న షారుఖ్ యువతని పక్కదారి పట్టించే ఇలాంటి గేమింగ్ యాప్ ని ప్రమోషన్ చేయడం ఏంటని ప్రశ్నిస్తూ.. 'అన్‌టచ్‌ ఇండియా ఫౌండేషన్‌'కు సంబంధించిన కొందరు వ్యక్తులు షారుఖ్ ఇంటిని ముట్టడించడానికి ప్రయత్నం చేశారు.
అయితే ఈ విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకొని వారిని అడ్డుకున్నారు. అలాగే జాగ్రత్త కోసం షారుఖ్ ఇంటి వద్ద కొంత పోలీస్ బందోబస్తుని ఏర్పాటు చేశారు. మరి ఈ స్టార్స్ ఇప్పటికైనా మారతారా..? లేదా తమకి నచ్చినట్లు యాడ్స్ చేసుకుంటూ తమ దారిలోనే ముందుకు వెళ్తారా..? అనేది చూడాలి.


Tags:    

Similar News