Ram Charan : రామ్‌చరణ్‌తో మూవీపై బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కామెంట్స్..
బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజ్ కుమార్ హిరానీతో రామ్ చరణ్ సినిమా చేయబోతున్నారా..? దర్శకుడు ఏం చెప్పారంటే..?
Rajkumar Hirani comments about movie with Ram Charan
Ram Charan : మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ 'ఆర్ఆర్ఆర్' సినిమాతో నేషనల్ టు ఇంటర్నేషనల్ ఎంతో ఫేమ్ ని సంపాదించుకున్నారు. ముఖ్యంగా బాలీవుడ్ లో తనని విమర్శించినవారే (జంజీర్ మూవీ టైములో) చేతనే ప్రశంసలు ఎదుర్కొని.. వారి చేత జైజైలు కొట్టించుకుంటున్నారు. ఇక ఆర్ఆర్ఆర్ రామ్ చరణ్ యాక్టింగ్ చూసిన బాలీవుడ్ దర్శకనిర్మాతలు మన మెగాపవర్ స్టార్ తో సినిమా చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. కానీ చరణ్ 'జంజీర్' విషయంలో జరిగినట్లు మరో తప్పు జరగకుండా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు.
కాగా గత కొంతకాలంగా టాలీవుడ్ అండ్ బాలీవుడ్ లో ఒక వార్త వినిపిస్తుంది. అసలు ఇప్పటి వరకు ఒక్క ప్లాప్ అందుకొని బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజ్ కుమార్ హిరానీతో రామ్ చరణ్ ఓ సినిమా చేయబోతున్నాడంటూ వార్తలు వచ్చాయి. హిరానీ దర్శకత్వంలో సినిమా అంటే హీరోకి నటుడిగా ఒక పరీక్ష లాంటిది అని చెప్పొచ్చు. ఎందుకంటే ఆయన సినిమాల్లో ప్రతి పాత్ర ఎన్నో ఎమోషన్స్ పండించాల్సి ఉంటుంది. మున్నాభాయ్ సిరీస్, త్రీ ఇడియట్స్, పీకే వంటి సినిమాలు తీసిన హిరానీ.. రీసెంట్ గా షారుఖ్ 'డంకీ'తో ఆడియన్స్ ముందుకు వచ్చారు.
ఈ చిత్రం ఇప్పటివరకు 340 కోట్లకు పైగా కలెక్షన్స్ అందుకొని సూపర్ హిట్ దిశగా వెళ్తుంది. ఇక ఈ మూవీ ప్రమోషన్స్ లో ఉన్న హిరానీ రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఆ ఇంటర్వ్యూలో హిరానీని.. "మీరు రామ్ చరణ్ తో సినిమా చేయబోతున్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. వాటిలో నిజం ఉందా..?" అని ప్రశ్నించారు.
దానికి హిరానీ బదులిస్తూ.. "న్యూస్ పేపర్స్ లో వస్తున్న ఆ వార్తలు నేను చూశాను. కానీ వాటిలో నిజం లేదు. నాకు రామ్ చరణ్ తెలుసు, కానీ ఎప్పుడు కలవలేదు. ఆర్ఆర్ఆర్ తన నటన అద్భుతం" అంటూ చెప్పుకొచ్చారు. హిరానీ కామెంట్స్ తో రామ్ చరణ్ సినిమా పై ఓ క్లారిటీ వచ్చేసింది. హిరానీ-చరణ్ మూవీ ఒక రూమర్ అని తేలిపోయింది.