బాలీవుడ్ నటి షెఫాలీ జరీవాలా మృతి

బాలీవుడ్ నటి షెఫాలీ జరీవాలా గుండె పోటుతో మరణించారు.

Update: 2025-06-28 03:23 GMT

బాలీవుడ్ నటి షెఫాలీ జరీవాలా గుండె పోటుతో మరణించారు. నిన్న రాత్రి గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే ఆమె అప్పటికే మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. షెఫాలీ జరీవాలా వయసు 42 సంవత్సరాలు. 2002లో కాంటా లగా పాటతో దేశ వ్యాప్తంగా షెఫాలీ జరీవాలా పాపులర్ అయ్యారు.

బిగ్ బాస్ లో ...
గుండెపోటుకు గురయిన వెంటనే ఆమె భర్త ఆసుపత్రికి తీసుకువచ్చారు. కానీ అప్పటికే ఆమె మరణించినట్లు వైద్యులు చెప్పడంతో కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు. షెఫాలీ జరీవాలా 2004లో ముఝ్ సే షాదీ కరోగా సినిమాలో కూడా నటించారు. బిగ్ బాస్ సీజన్ 13లో కూడా షెఫాలీ జరీవాలా పాల్గొన్నారు. అనేక డ్యాన్స్ షోలతో అందరికీ మరింత దగ్గరయ్యారు. ఆమె మృతితో బాలివుడ్ లో విషాదం నెలకొంది.


Tags:    

Similar News