Bigg Boss : బిగ్ బాస్ కంటెస్టెంట్లు రెడీ...లవ్ ట్రాక్ కూడా సిద్ధమేనట
బిగ్ బాస్ సీజన్ 9 ఈ నెల 7వ తేదీ నుంచి ప్రారంభం కానుంది
బిగ్ బాస్ సీజన్ 9 ఈ నెల 7వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. బుల్లి తెర ప్రేక్షకులను వంద రోజుల పాటు అలరించే బిగ్ బాస్ షో కు ఇప్పటికే అనేక మంది కంటెస్టెంట్లను ఎంపిక చేశారు. బిగ్ బాస్ హౌస్ సరికొత్త అందాలతో అన్నపూర్ణ స్టూడియోస్ లో రూపుదిద్దుకుంది. హోస్ట్ గా కింగ్ అక్కినేని నాగార్జున వ్యవహరిస్తున్న ఈ షోలో సస్పెన్స్ లు, థ్రిల్లింగ్ లు, ఫైటింగ్ లు, తిట్లు, చివాట్లు, ప్రేమలు ఇలా నవరసాలు నిండి ఉండటంతో గత ఎనిమిది సీజన్ లుగా ఈ షో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.
కంటెస్టెంట్ల ఎంపిక...
సెప్టెంబరు 7వ తేదీన ప్రారంభమయ్యే షోకు సంబంధించి ఇప్పటికే ప్రీ షోలుగా అగ్ని పరీక్ష పేరుతో కొందరిని ఎంపిక చేసింది. ఈ బిగ్ బాస్ షోలో విభిన్న మైన టాస్క్ లను రెడీ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. అదే సమయంలో ఎలిమినేషన్ ప్రక్రియలో కూడా కొత్త విధానాన్ని చూపించపోతున్నట్లు ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దాదాపు పదిహేను నుంచి పదహారు మంది కంటెస్టెంట్లు తొలి రోజు హౌస్ లోకి అడుగు పెడతారన్న టాక్ బలంగా వినిపిస్తుంది.
ప్రారంభ ఎపిసోడ్...
సెప్టంబరు 7వ తేదీన ప్రారంభం కానున్న తొలి ఎపిసోడ్ ను దాదాపు మూడు నుంచి నాలుగు గంటల పాటు చిత్రీకరించేందుకు సిద్ధం చేస్తున్నారట. అందులో కంటెస్టెంట్ల ఎంట్రీలు, వారి బ్యాక్ గ్రౌండ్ తెలిపే విధానం కూడా విభిన్నంగా ఉంటుందని చెబుతున్నారు. ఈ బిగ్ బాస్ షో మాటీవీలో ప్రారంభం కానుంది. ఈ షోకు ఎక్కువ టీఆర్పీ రేటింగ్స్ వస్తుండటంతో ప్రతి సీజన్ లో కంటెస్టెంట్ల ఎంపికలోనూ అన్ని రకాల మనస్తత్వం ఉన్న వారిని ఎంపిక చేస్తున్నారని టాక్. దివ్వెల మాధురితో పాటు కామెడీ షో జబర్దస్త్ నటి రీతూ చౌదరి కూడా ఈ షోలో కంటెస్టెంట్లుగా ఎంపిక చేశారన్న టాక్ వినపడుతుంది. వీరితో పాటు జబర్దస్త్ షో కమెడియన్ ఇమ్మాన్యుయేల్ కూడా ఉన్నారంటున్నారు.