భీమ్లా నాయక్ విడుదల వాయిదా ? మేకర్స్ ఏం చెప్తున్నారు ?

దీంతో భీమ్లా నాయక్ సినిమాను అనుకున్న సమయానికే విడుదల చేస్తారా ? అన్న అనుమానాలొస్తున్నాయి. ఎందుకంటే.. విడుదల తేదీకి

Update: 2021-12-19 10:51 GMT

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ - రానా దగ్గుబాటిల కాంబినేషన్ లో మల్టీస్టారర్ గా వస్తోన్న సినిమా భీమ్లా నాయక్. మలయాళంలో సూపర్ హిట్ అయిన అయ్యప్పన్ కోషియమ్ సినిమాకి తెలుగులో రీమేక్ గా తీస్తున్న ఈ సినిమా సంక్రాంతికి బరిలో దిగనుంది. కానీ.. ఇంకా షూటింగ్ పూర్తికాలేదు. లాస్ట్ షెడ్యూల్ షూట్ ఇంకా మిగిలి ఉండటంతో.. ఆ షెడ్యూల్ షూటింగ్ శనివారమే వికారాబాద్ లో ప్రారంభమైంది. దీంతో భీమ్లా నాయక్ సినిమాను అనుకున్న సమయానికే విడుదల చేస్తారా ? అన్న అనుమానాలొస్తున్నాయి. ఎందుకంటే.. విడుదల తేదీకి ఇరవై రోజులే సమయం ఉండగా ప్రస్తుతం సినిమా ఇంకా వికారాబాద్ అడవుల్లో షూటింగ్ జరుపుకుంటుంది. అది పూర్తయ్యాక పోస్ట్ ప్రొడక్షన్ పనులతో పాటు సినిమా ప్రమోషన్స్ చేపట్టాల్సి ఉంది. ఇవన్నీ 20 రోజుల్లో పూర్తవుతాయా ? ఖచ్చితంగా సినిమా విడుదల వాయిదా పడుతుందని సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం జరుగుతోంది.

నిన్నటి వరకూ ఈ సినిమాను నిర్మిస్తున్న నిర్మాత నాగవంశీ కూడా జనవరి 12వ తేదీన భీమ్లా నాయక్ ను విడుదల చేస్తామని ధీమాగా చెప్పారు. కానీ ఇప్పుడు అనుకున్న సమయానికి అన్నీ పూర్తవుతాయా ? ఇప్పుడు సినిమాను విడుదల చేయాలా ? వాయిదా వేయాలా ? అన్న డైలమాలో పడినట్లు తెలుస్తోంది. గత వారం రిలీజైన పుష్ప సినిమాను కూడా హడావుడిగా రిలీజ్ చేశారనే విమర్శలు రావడంతో.. భీమ్లా నాయక్ విడుదలపై మరోసారి చర్చించిన తర్వాత.. మేకర్స్ ఖచ్చితమైన విడుదల తేదీని ప్రకటిస్తారని సమాచారం. భీమ్లా నాయక్ అనుకున్న సమయానికే వస్తాడా ? లేక కాస్త ఆలస్యమవుతుందా ? తెలియాలంటే మేకర్స్ స్పందించేంతవరకూ వెయిట్ చేయక తప్పదు.


Tags:    

Similar News