బాలకృష్ణ ఈసారైనా రవితేజపై గెలుస్తాడా..?

బాలకృష్ణ బాక్స్ ఆఫీస్ వద్ద ఇప్పటికే మూడుసార్లు రవితేజతో పోటీపడాడు. అయితే ప్రతిసారి ఓడిపోతూనే వచ్చాడు.

Update: 2023-10-07 11:30 GMT

ఈ దసరాకి నటసింహ బాలకృష్ణ 'భగవంత్ కేసరి' సినిమాతో, మాస్ మహారాజ్ రవితేజ 'టైగర్ నాగేశ్వరరావు' మూవీతో పోటీ పడబోతున్నారు. ఈ రెండు చిత్రాలు ఏంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్నాయి. అఖండ, వీరసింహారెడ్డి సినిమాలతో వరుస సక్సెస్ లో ఉన్న బాలయ్య.. భగవంత్ కేసరితో కూడా హిట్ కొట్టి హ్యాట్రిక్ అందుకోవాలని చూస్తున్నాడు. ఇక రవితేజ.. టైగర్ నాగేశ్వరరావుతో పాన్ ఇండియా మార్కెట్ లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. దీంతో ఇద్దరికీ ఈ రెండు సినిమాల విజయం చాలా ముఖ్యం అయ్యింది.

కాగా వీరిద్దరూ కలిసి పోటీ పడడం.. ఇదేమి మొదటిసారి కాదు. ఇప్పటికే వీరిద్దరూ మూడుసార్లు బాక్స్ ఆఫీస్ వద్ద పోటీ పడ్డారు. అయితే ప్రతిసారి బాలయ్య పైన రవితేజనే విజయం సాధిస్తూ వచ్చాడు. దీంతో రవితేజ అభిమానులు.. ఈసారి కూడా విజయం పక్కా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇంతకీ వీరిద్దరూ కలిసి ఎప్పుడెప్పుడు, ఏయే సినిమాలతో పోటీ పడ్డారు. మీరుకూడా వాటిపై ఒక లుక్ వేసేయండి.
మొదటిసారి 2008లో బాలయ్య 'ఒక్కమగాడు', రవితేజ 'కృష్ణ' సినిమాలతో ఇద్దరు పోటీ పడ్డారు. ఇక వాటి ఫలితాలు చెప్పనవసరం లేదు అనుకుంటా. ఆ తరువాత 2009లో మిత్రుడు, కిక్ సినిమాలు రిలీజ్ అవ్వగా.. అభిమానులకు రవితేజ కిక్‌ని, బాలయ్య షాక్‌ని కలిగించాడు. ఈ పోటీ తరువాత 2011లో బాలయ్య ‘పరమవీరచక్ర’, రవితేజ ‘మిరపకాయ్’ వచ్చాయి. ఈసారి కూడా రవితేజనే విజయం సాధించాడు.
ఇక్కడ గుర్తించాల్సిన ఇంకో విషయం ఏంటంటే.. పోటీలో హిట్ అందుకున్న ప్రతి సినిమా రవితేజ కెరీర్ లో ఒక మైలురాయిగా నిలిచింది. ప్లాప్ అయిన ప్రతి సినిమా బాలయ్య కెరీర్ లో మర్చిపోలేని డిజాస్టర్స్ గా నిలిచింది. మరి ఈసారి ఎలాంటి రిజల్ట్స్ ని అందుకుంటారో చూడాలి. ఇక సోషల్ మీడియాలో దీని గురించి పోస్టులు వేస్తూ.. బాలయ్య ఈసారైనా రవితేజపై గెలుస్తాడా..? కామెంట్స్ చేస్తున్నారు. కాగా 'భగవంత్ కేసరి' అక్టోబర్ 19న, 'టైగర్ నాగేశ్వరరావు' అక్టోబర్ 20న రిలీజ్ కానున్నాయి.


Tags:    

Similar News