భగవంత్ కేసరి, లియో.. ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంత..?

భగవంత్ కేసరి, లియో ఆడియన్స్ ని పలకరించేశాయి. మరి బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమాల టాక్ ఏంటి..? ఫస్ట్ డే కలెక్షన్స్..?

Update: 2023-10-20 09:47 GMT

ఈ దసరాకి పెద్ద సినిమాలు బాక్స్ ఆఫీస్ పోటీకి దిగాయి. బాలకృష్ణ 'భగవంత్ కేసరి', విజయ్ 'లియో', రవితేజ 'టైగర్ నాగేశ్వరరావు'. ఇక మూడు చిత్రాల్లో భగవంత్ కేసరి, లియో నిన్నే ఆడియన్స్ ని పలకరించేశాయి. మరి బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమాల టాక్ ఏంటి..? ఫస్ట్ డే కలెక్షన్స్..?

ముందుగా 'లియో' గురించి మాట్లాడుకుందాం. తమిళ్ డబ్బింగ్ సినిమా అయినప్పటికీ లోకేష్ కనగరాజ్ దర్శకుడు కావడంతో తెలుగులో కూడా భారీ హైప్ క్రియేట్ అయ్యింది. ఇక్కడ బాలయ్య, రవితేజ సినిమాలతో సమానంగా రిలీజ్ అయ్యింది. అయితే థియేటర్స్ వద్ద ఈ సినిమా ఆశించిన స్థాయిలో లేదని, లోకేష్ కనగరాజ్ మార్క్ మూవీ ఇది కాదని చెబుతున్నారు. అయితే మూవీపై భారీ హైప్ ఉండడంతో రికార్డు కలెక్షన్స్ ని అందుకుంది.
ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రూ.132.5 కోట్ల గ్రాస్ కలెక్షన్స్‌ని అందుకుందని నిర్మాతలు తెలియజేశారు. ఒక్క తమిళనాడులోనే రూ.43 కోట్ల గ్రాస్ ని రాబట్టింది. కాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ దాదాపు 200 కోట్లకు పైగా జరిగినట్లు తెలుస్తుంది. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ సాధించాలంటే.. సుమారు 400 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ ని రాబట్టాలి.
ఇక 'భగవంత్ కేసరి' విషయానికి వస్తే.. బాలయ్య అఖండ, వీరసింహారెడ్డి సినిమాలతో వరుస సక్సెస్ లతో ఉండడం, మూవీ నుంచి రిలీజ్ అయిన ట్రైలర్ అండ్ టీజర్ కూడా ఆకట్టుకోవడంతో సినిమా పై మంచి హైప్ క్రియేట్ అయ్యింది. బాక్స్ ఆఫీస్ వద్ద కూడా మిక్స్డ్ టాక్ నే సొంతం చేసుకుంది. బాలయ్య, దర్శకుడు అనిల్ రావిపూడి నుంచి వచ్చే రెగ్యులర్ ఫార్మేట్ సినిమాలు కాకుండా కొంచెం కొత్తగా ఉందని చెబుతున్నారు.
వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ వద్ద ఈ మూవీ.. రూ.32.33 కోట్ల గ్రాస్ కలెక్షన్స్‌ని అందుకున్నట్లు చిత్ర నిర్మాతలు తెలియజేశారు. ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికి వస్తే.. సుమారు 65 కోట్ల వరకు జరిగినట్లు సమాచారం. ఈ మూవీ బ్రేక్ ఈవెంట్ సాధించాలంటే.. సుమారు రూ.130 కోట్లు వరకు కలెక్ట్ చేయాల్సి ఉంది.
ఇక ఇవాళ రిలీజ్ అయిన రవితేజ 'టైగర్ నాగేశ్వరరావు'కి పాజిటివ్ టాక్ వినిపిస్తుంది. మొదటిరోజు ప్రీ బుకింగ్స్ బట్టి చూస్తే.. ఈ సినిమా ఫస్ట్ డే 10 కోట్ల వరకు కలెక్ట్ చేసే అవకాశం ఉందని సినీ పండితులు చెబుతున్నారు. ఇక ఈ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ సుమారు 37 కోట్ల వరకు జరిగిందని టాక్ వినిపిస్తుంది. అంటే బాక్స్ ఆఫీస్ వద్ద ఈ మూవీ 75 కోట్ల వరకు కలెక్ట్ చేయాల్సి ఉంటుంది. మరి ఈ మూడు పోటీ పడి బ్రేక్ ఈవెన్ సాదించగలవా..? లేదా..? చూడాలి.


Tags:    

Similar News