Avatar 2 : కుటుంబంతో కలిసి అవతార్ 2 చూడాలంటే జేబుకి చిల్లేనా ?

ఇప్పటికే విడుదలైన ట్రైలర్ కు ఆడియన్స్ నుండి విశేష స్పందన వచ్చింది. ఒక్క ట్రైలర్ తో సినిమాపై అంచనాలు..

Update: 2022-11-23 09:52 GMT

avatar 2 ticket price

అవతార్.. 13 ఏళ్ల క్రితం వచ్చిన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా భారీ విజయం సాధించింది. తొలుత ట్రైలర్ చూసి ఈ సినిమా ఎవరు చూస్తారులే అనుకున్నవారు చాలామంది ఉన్నారు. కానీ.. బొమ్మ తెరపైకి పడిన తర్వాత ఆడియన్స్ నుండి ఊహించని రెస్పాన్స్ వచ్చింది. కొత్త గ్రహం, కొత్త భాష.. వింతగా కనిపించే మనుషుల్లాంటి అవతారాలు.. ఈ సినిమా వైపు దృష్టి మళ్లేలా చేశారు. ఆ అవతార్ దర్శకుడు జేమ్స్ కామెరూన్ మళ్లీ.. అవతార్ 2 తో కొత్త రికార్డులు సృష్టించేందుకు సిద్ధమవుతున్నాడు.

ఇప్పటికే విడుదలైన ట్రైలర్ కు ఆడియన్స్ నుండి విశేష స్పందన వచ్చింది. ఒక్క ట్రైలర్ తో సినిమాపై అంచనాలు రెట్టింపయ్యాయి. డిసెంబర్ 16న 160 భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా 2డీ, 3డీ, 4డీఎక్స్ 3డీ, ఐమ్యాక్స్3డీ ఫార్మట్లలో సినిమా విడుదల కాబోతోంది. రూ.100 కోట్లకు పైగా ఖర్చుతో తీసిన ఈ సినిమా తొలిరోజే రూ.40 కోట్ల బిజినెస్ చేస్తుందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. మనదేశంలో హిందీ, తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ.. మొత్తం 5 భాషల్లో సినిమా విడుదల కానుంది. సినిమా విడుదలకు ఇంకా 20 రోజులపైగా సమయం ఉన్నా.. అప్పుడే అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి.
బుకింగ్స్ లో రేట్లు చూస్తే దిమ్మతిరగడం ఖాయం. ఒక్కో సిటీలో.. ఒక్కో ఫార్మాట్ కి ఒక్కో రేటు ఉంది. అభిమాన హీరోల సినిమాల టికెట్ ధరలకంటే రెండు మూడింతలు ఎక్కువగా ఉంది అవతార్ 2 టికెట్ రేటు. హైదరాబాద్ లో 4డీఎక్స్ ఫార్మెట్ లో టికెట్ ధర రూ. 350, బెంగళూరులో ఐమ్యాక్స్ ప్రీమియం సీట్ల ధర రూ. 1500, 3డీ ప్రీమియం రూ.1650, ముంబయిలో 4డీఎక్స్ 3డీ ఫార్మెట్ లో గరిష్టంగా రూ.1700, కనిష్టంగా రూ.740, ఢిల్లీలో ఐమ్యాక్స్ 3డీ ఫార్మేట్ లో రూ. 1000, కలకత్తాలో ఐమ్యాక్స్ 3డీ ఫార్మేట్ లో రూ. 800, అహ్మదాబాద్ లో ఐమ్యాక్స్ 3డీ ఫార్మేట్ లో రూ.750, చండీగడ్ లో 4డీఎక్స్ 3డీ ఫార్మెట్ లో రూ.400, పూణెలో 4డీఎక్స్ 3డీ ఫార్మెట్ లో రూ.900 ఉన్నాయి. మరికొన్ని ప్రాంతాల్లో బుకింగ్స్ ఓపెన్ అవ్వాల్సి ఉంది.


Tags:    

Similar News