Anushka Sharma : కోహ్లీ బర్త్‌డే.. అనుష్క అడిగిన బహుమతి ఏంటో తెలుసా..?

కోహ్లీ 35వ పుట్టినరోజు నాడు భార్య అనుష్క శర్మ అడిగిన ఎదురు బహుమతి ఏంటో తెలుసా..?

Update: 2023-11-05 13:11 GMT

Anushka Sharma : బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. స్టార్ హీరోయిన్ గా పలు బడా సినిమాల్లో నటించిన ఈ భామ.. ఇండియన్ క్రికెట్ టీంలో కింగ్ అనిపించుకున్న విరాట్ కోహ్లీని ప్రేమించి పెళ్లి చేసుకొని వదినమ్మగా ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది.


కాగా నేడు నవంబర్ 5న కోహ్లీ పుట్టినరోజు అన్న విషయం తెలిసిందే. నేటితో ఈ స్టార్ ఆటగాడు 35 ఏళ్ళు పూర్తి చేసుకున్నాడు. ఇక ఈ బర్త్ డే సందర్భంగా అనుష్క కోహ్లీని ఎదురు బహుమతి అడిగింది. ప్రస్తుతం వన్ డే వరల్డ్ మ్యాచ్స్ జరుగుతున్న విషయం తెలిసిందే. నేడు ఇండియా, ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్ జరుగుతుంది.


ఈ మ్యాచ్ లో కోహ్లీ శతకం కొడితే కొత్త రికార్డుని సృష్టిస్తాడు. ఇప్పటి వరకు అత్యధిక శతకాలు సాధించిన లిస్ట్ లో నెంబర్ వన్ గా సచిన్ టెండూల్కర్ ఉన్నాడు. 452 ఇన్నింగ్స్‌ల్లో సచిన్ 49 శతకాలు సాధించాడు. కాగా కోహ్లీ 48 శతకాలతో ఒక అడుగు దూరంలో ఉన్నాడు. దీంతో అనుష్క ఈ బర్త్ డేకి ఆ 49వ సెంచరీ కొట్టి తనకి ఎదురు గిఫ్ట్ ఇవ్వమని తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో స్టేటస్ పెట్టింది.


ఇది అనుష్క కోరిక మాత్రం కాదు. కింగ్ అభిమానులందరి కోరిక. మరి కింగ్ ఆ కోరిక తీర్చకుండా ఉంటాడా.. ఈరోజు జరిగిన మ్యాచ్ లో కోహ్లీ 49 శతకాన్ని కొట్టి.. కేవలం 277 ఇన్నింగ్స్‌ల్లోనే సచిన్ రికార్డుని సొంత చేసుకున్నాడు. ప్రస్తుతం సోషల్ మీడియా అంతా కింగ్ కోహ్లీ అంటూ ప్రశంసలు జల్లు కురుస్తుంది.




కాగా ఇప్పటి వరకు వ‌న్డేల్లో అత్య‌ధిక సెంచ‌రీలు చేసిన వారి రికార్డ్స్ చూసుకుంటే.. 433 ఇన్నింగ్స్‌ల్లో 28 శ‌త‌కాలతో శ్రీలంక‌ ఆటగాడు సనత్ జయసూర్య, 365 ఇన్నింగ్స్‌ల్లో 30 శ‌త‌కాలతో ఆస్ట్రేలియా ఆటగాడు రికీ పాంటింగ్, 251 ఇన్నింగ్స్‌ల్లో 31 శ‌త‌కాలతో భార‌త్‌ ఆటగాడు రోహిత్ శర్మ, 452 ఇన్నింగ్స్‌ల్లో 49 శ‌త‌కాలతో భార‌త్‌ ఆటగాడు సచిన్ టెండూల్కర్, 277 ఇన్నింగ్స్‌ల్లో 49 శ‌త‌కాలతో భార‌త్‌ ఆటగాడు విరాట్ కోహ్లీ.


Tags:    

Similar News