ఫిష్ వెంకట్ ఇక లేరు
టాలీవుడ్ లో మరో విషాదం నెలకొంది. సినీనటుడు ఫిష్ వెంకట్ మృతి చెందారు
టాలీవుడ్ లో మరో విషాదం నెలకొంది. సినీనటుడు ఫిష్ వెంకట్ మృతి చెందారు. ఆయన వయసు యాభై మూడేళ్లు. మూత్రపిండాల వ్యాధితో ఫిష్ వెంకట్ గత కొన్నాళ్లుగా బాధపడుతున్నారు. ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. శుక్రవారం రాత్రి ఫిష్ వెంకట్ మృతి చెందారు. హైదరాబాద్ లోని ఒక ప్రయివేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
రెండు కిడ్నీలు చెడిపోవడంతో...
రెండు కిడ్నీలు చెడిపోవడంతో కిడ్నీ మార్పిడి చేయాలని వైద్యులు సూచించారు. అయితే ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న ఫిష్ వెంకట్ కుటుంబం ఆర్థిక సాయం కోసం చిత్ర పరిశ్రమ వైపు చూస్తుంది. ఈలోపుగానే ఆయన మరణించాడు. ఫిష్ వెంకట్ దాదాపు వందకు పైగానే చిత్రాల్లో నటించారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, హాస్యనటుడిగా ఫిష్ వెంకట్ అందరి మన్ననలను పొందారు.