చిరంజీవికి చంద్రబాబు బర్త్ డే విషెస్
మెగాస్టార్ చిరంజీవికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు
మెగాస్టార్ చిరంజీవికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. చిరంజీవి 70వ పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు ఈ మేరకు చంద్రబాబు నాయుడు ఎక్స్ లో ట్వీట్ చేశారు. సినిమా రంగంలోనూ, దాతృత్వంలో అద్భుత ప్రయాణం లక్షలమందికి స్ఫూర్తినిచ్చిందిచిరంజీవి అని చంద్రబాబు పేర్కొన్నారు.
మరిన్ని పుట్టిన రోజులు...
సేవ, అంకితభావంతో ఇంకా ఎందరో జీవితాలను ప్రభావితం చేయాలని కోరుకుంటున్నానని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు. నిండు నూరేళ్లు ఆరోగ్యం, ఆనందంతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని సీఎం చంద్రబాబు తెలిపారు. మరిన్ని పుట్టిన రోజులు జరుపుకుని, లక్షలాదిమందికి సేవలందించాలని ఆయన ఆకాంక్షించారు.