Breaking : తెలుగు సినిమాలకు ట్రంప్ షాక్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. విదేశీ సినిమాలపై వంద శాతం సుంకాలను పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.

Update: 2025-09-29 13:26 GMT

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. విదేశీ సినిమాలపై వంద శాతం సుంకాలను పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఇండియన్ సినమాలకు ట్రంప్ బిగ్ షాక్ ఇచ్చారు. అయితే అమెరికాలో నిర్మించిన సినిమాలకు మాత్రం సుంకాల నుంచి మినహాయించారు. ఇతర ప్రాంతాల్లో నిర్మించి అమెరికాలో విడుదల చేసే సినిమాలకు మాత్రమే ఈ వంద శాతం సుంకం వర్తిస్తుంది.

అక్కడ నిర్మించే వాటికి మాత్రం...
తెలుగులో సినిమాలు నిర్మించి అమెరికాలో విడుదల చేస్తున్నారు. ఓవర్సీస్ కలెక్షన్లతో తమ బాక్సాఫీసు రికార్డులను బద్దలు కొడుతున్నారు. దాదాపుగా తెలుగులో విడుదలయ్యే ప్రతి సినిమా అమెరికాలో విడుదలవుతుంది. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన వంద శాతం సుంకంతో తెలుగు సినిమాకు కష్టాలు మొదలయినట్లేనని అంటున్నారు.


Tags:    

Similar News