రాష్ట్రపతి చేతులు మీదుగా జాతీయ అవార్డులు అందుకున్న టాలీవుడ్..

జాతీయ అవార్డుల ప్రధానోత్సవం నేడు దేశరాజధాని ఢిల్లీలో ఘనంగా జరిగింది. విజేతలు అందరూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము..

Update: 2023-10-17 13:05 GMT

భారతీయ చలనచిత్రసీమ ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే జాతీయ అవార్డులను ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ 69వ జాతీయ పురస్కారంలో తెలుగు నటులు, టెక్నీషియన్స్ సత్తా చాటారు. సంగీతం, సాహిత్యం, ఫైట్స్, డాన్స్, యాక్టింగ్, దర్శకత్వం, నిర్మాణం.. ఇలా ప్రతి ముఖ్య క్యాటగిరిలో తెలుగు సినిమా అవార్డుని అందుకొని జయహో అనిపించింది. ఇక ఎన్నో ఏళ్లగా ఒక కలలా ఉన్న ఉత్తమ నటుడు అవార్డుని అల్లు అర్జున్ గెలుచుకోవడం అందర్నీ సంతోష పరిచింది.

కాగా ఈ అవార్డుల ప్రధానోత్సవం నేడు దేశరాజధాని ఢిల్లీలో ఘనంగా జరిగింది. విజేతలు అందరూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతులు మీదుగా తమ అవార్డులను అందుకున్నారు. ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్, ఉత్తమ సంగీత దర్శకుడు క్యాటగిరీలో దేవిశ్రీప్రసాద్ (పుష్ప సాంగ్స్), కీరవాణి (RRR నేపధ్య సంగీతం), ఉత్తమ గాయకుడుగా కాలభైరవ (కొమరం భీముడో), ఉత్తమ డాన్స్ కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్ (RRR), ఉత్తమ పాపులర్ ఫిల్మ్ RRR, ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్స్ వి శ్రీనివాస్ మోహన్ (RRR), ఉత్తమ లిరిక్ రైటర్ చంద్రబోస్ (కొండపోలం మూవీ), ఉత్తమ స్టంట్ మాస్టర్ కింగ్ సోలొమాన్ (RRR), ఉత్తమ ఫీచర్ ఫిల్మ్ ఉప్పెన, ఉత్తమ ఫిల్మ్ క్రిటిక్ ‘పురుషోత్తమ చార్యులు’.. ఈ క్యాటగిరీల్లో తెలుగుకి జాతీయ పురస్కారం అందింది.


Tags:    

Similar News