డైరెక్టర్ క్రిష్‌తో అల్లు అర్జున్ సినిమా అన్నారు.. కానీ అది..

డైరెక్టర్ క్రిష్‌తో అల్లు అర్జున్ బాలీవుడ్ సినిమా అంటూ పోస్టర్ వైరల్. కట్ చేస్తే అది ఒక..

Update: 2023-09-28 14:09 GMT

ఈరోజు (సెప్టెంబర్ 28) ఉదయం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) కి సంబంధించిన ఒక వార్త బయటికి వచ్చింది. టాలీవుడ్ దర్శకుడు క్రిష్ జాగర్లమూడితో బన్నీ ఒక మూవీ చేయబోతున్నాడంటూ ఒక పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఆ పోస్టర్ లో మూవీ టైటిల్ 'కభీ అప్నే కభీ సప్నే' అని ఉండి.. ఏ ఫిల్మ్ బై క్రిష్ జాగర్లమూడి అని కనిపిస్తుంది. అలాగే పోస్టర్ లో బన్నీని రెండు లుక్స్ లో చూపించారు.

ఇక సడన్ గా ఈ పోస్టర్ చూసిన అభిమానులు అసలు ఇది ఏమైంటుందని ఆలోచనలో పడ్డారు. ఒకవేళ ఏదైన కమర్షియల్ యాడ్ అయ్యింటుందని అని అనుకున్నారు. అయితే పోస్టర్ లో హిందీ టైటిల్ ఉండడంతో ఏమన్నా బాలీవుడ్ ప్రాజెక్టా..? అనే సందేహం కూడా మొదలైంది. సరిలే త్వరలోనే ఇది ఏంటనేది తెలుస్తుందిలే అని అనుకుంటున్న సమయంలో.. నెట్టింట ఒక వీడియో ప్రత్యెక్షమైంది. ఆ వీడియోలో ఒక బస్ట్ స్టేషన్ లో చిత్రీకరించిన సన్నివేశాలను చూపించారు.

బస్సులో ప్రయాణించే పాసెంజర్స్ అండ్ అల్లు అర్జున్ మధ్య కొన్ని సీన్స్ వీడియోలో ఉన్నాయి. కాగా ఈ వీడియోలో అల్లు అర్జున్ రెడ్ డ్రెస్ లో కనిపిస్తున్నాడు. గతంలో బన్నీ ‘రెడ్ బస్’ కోసం కొన్ని యాడ్స్ చేసిన సంగతి తెలిసిందే. ఆ యాడ్స్ లో కూడా అల్లు అర్జున్ రెడ్ డ్రెస్ లో కనిపించాడు. దీంతో ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ కూడా రెడ్ బస్సుకి సంబంధించిందే అని, క్రిష్ దీనిని డైరెక్ట్ చేస్తున్నాడని నెటిజెన్స్ ఒక నిర్దారణకి వచ్చేశారు.
అయితే ఇది హిందీ ఆడియన్స్ కోసం చేస్తున్న యాడ్ అని తెలుస్తుంది. పుష్ప సినిమాతో అల్లు అర్జున్ నార్త్ లో భారీ క్రేజ్ ని సొంతం చేసుకున్నాడు. ఇక ఇన్నాళ్లు తెలుగు ఆడియన్స్ వరుకే అల్లు అర్జున్ ని తమ సంస్థకు అంబాసడర్ గా ఉపయోగించుకున్న రెడ్ బస్.. ఇప్పుడు నార్త్ లో కూడా బన్నీనే బ్రాండ్ అంబాసడర్ గా తీసుకున్నట్లు తెలుస్తుంది. మరి ఈ యాడ్ ని అఫీషియల్ ఎప్పుడు రిలీజ్ చేస్తారో చూడాలి.


Tags:    

Similar News