Akkineni Nagarjuna : నాగార్జున ఇక విలన్ గా మారుతున్నారా? కింగ్ ఫ్యాన్స్ ఆయనను అలా చూడగలరా?

అక్కినేని నాగార్జున ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించారు. .

Update: 2025-08-04 06:24 GMT

అక్కినేని నాగార్జున ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించారు. ఆయన సహచర హీరోలు నేటికీ టాలీవుడ్ లో కథానాయకులుగా బిజీగా ఉన్నారు. చిరంజీవి, వెంకటేశ్, బాలకృష్ణ వంటి నటులు హీరోలుగానే వారి అభిమానులకు కనిపిస్తూ నేటికి జోష్ నింపుతున్నారు. అరవై పదులు దాటినా యంగ్ హీరోలతో పోటీ పడుతున్నారు. కానీ నాగార్జున మాత్రం ఎందుకో కాస్తంత వెనకబడిపోయినట్లే కనిపిస్తుంది. ఆయన తీసుకున్న నిర్ణయం కరెక్టేనా? కాదా? అన్నది పక్కన పెడితే ఇటీవల విలన్ రోల్ పోషిస్తుండటం ఒకింత అక్కినేని ఫ్యాన్స్ మనసును కలచివేస్తుంది.

బుల్లితెరపై.. ఓటీటీలోనూ...
నాటి అగ్రహీరోలందరూ బుల్లితెరలో కూడా కనిపిస్తున్నారు. వెంకటేశ్ ను పక్కన పెడితే చిరంజీవి గతంలో మీలో ఎవరు కోటీశ్వరుడు ప్రోగ్రాం చేశారు. నందమూరి బాలకృష్ణ అన్ స్టాపబుల్ షోలో ఆహా ఓటీటీలో కనిపిస్తున్నారు. నాగార్జున అయితే బిగ్ బాస్ సీజన్ లన్నింటికీ హోస్ట్ గా చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఒక్కసారి ఆయన హీరో రోల్ నుంచి విలన్ గా పరకాయప్రవేశం చేసినట్లు కనపడుతుంది. గత కొంత కాలంగా నాగార్జునకు సరైన హిట్ దొరకడం లేదు. ఎన్ని సినిమాలు విడుదలయినప్పటికీ అంతగా కలెక్షన్లు కూడా రాబట్టలేదు.
కూలీలోనూ విలన్ గానే...
అయితే నాగార్జున ఇటీవల నటించిన కుబేర మూవీలో ఒక ప్రత్యేక పాత్రలో కనిపించారు. మూవీలో నాగార్జున రోల్ బాగున్నప్పటికీ ఆ పాత్ర చనిపోవడంతో అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. కుబేర మూవీ బాక్సాఫీస్ సూపర్ హిట్ అయింది. అందులో నాగార్జున నటనకు కూడా మంచి మార్కులు పడ్డాయి. దీంతో వెంటనే ఆయన సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న కూలీ చిత్రలోనూ విలన్ గా నటిస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్, శాండిల్ వుడ్ స్టార్ ఉపేంద్ర పాటు నాగార్జున కూడా నటిస్తున్నారు. ఈ చిత్రానికి లోకేశ్ కనకరాజ్ దర్శకత్వం వహిస్తుండగా, ఈ నెల 14వ తేదీన ఈ మూవీ విడుదల కానుంది. దీంతో మరో విలన్ పాత్రలో నాగార్జునను చూసిన ఫ్యాన్స్ ఎలా తట్టుకుంటారన్నది చూడాల్సి ఉంది.


Tags:    

Similar News