అడవిని దత్తత తీసుకున్న నాగార్జున దంపతులు !

అక్కినేని నాగేశ్వరరావు అర్బన్ ఫారెస్ట్ ఏర్పాటుకు శంకుస్థాపన చేశారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా నాగార్జున అడవిని దత్తత

Update: 2022-02-17 07:05 GMT

బిగ్ బాస్ సీజన్ 5 లో.. ఓ ఎపిసోడ్ లో నాగార్జున 1000 ఎకరాల రిజర్వ్ ఫారెస్ట్ ను దత్తత తీసుకుంటానని ఎంపి సంతోష్ కుమార్ కు మాట ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం.. నేడు సీఎం కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా తన భార్య అమల, మంత్రి మ‌ల్లారెడ్డి, ఎంపీ సంతోష్ కుమార్ తో క‌లిసి మేడ్చల్ జిల్లా చెంగిచెర్లకు వెళ్లారు. అక్కడ 1000 ఎకరాల రిజర్వ్ ఫారెస్ట్ ను నాగార్జున దత్తత తీసుకున్నారు.

అలాగే అక్కినేని నాగేశ్వరరావు అర్బన్ ఫారెస్ట్ ఏర్పాటుకు శంకుస్థాపన చేశారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా నాగార్జున అడవిని దత్తత తీసుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు ఎంపీ సంతోష్ కుమార్. ఈ కార్యక్రమంలో నాగార్జున ఇద్దరు కొడుకులు నాగచైతన్య, అఖిల్ లు కూడా భాగస్వాములయ్యారు. వీరంతా కలిసి ఆ ప్రాంతంలో మొక్కలను నాటారు. కాగా.. ఎంపీ సంతోష్ కుమార్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను మొదలు పెట్టి.. దాని ఆవశ్యకతను దేశానికి చాటిచెప్పేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే కోట్ల మొక్కలను నాటించినట్లు ఆయన గతంలో పేర్కొన్నారు. 


Tags:    

Similar News