7 మిలియన్ ఫ్యామిలోకి చైతూ.. కలిసొచ్చిన బాలీవుడ్ ఎంట్రీ ?

కానీ.. ఇప్పటి వరకూ చైతన్య ఇన్ స్టా 59 పోస్టులు మాత్రమే చేశారు. ఏదేమైనా.. సోషల్ మీడియాను అవసరానికి మించకుండా..

Update: 2022-03-22 11:40 GMT

హైదరాబాద్ : సెలబ్రిటీలకు సోషల్ మీడియాలో ఉండే ఫ్యాన్ ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. వాళ్లు పెట్టో పోస్టులు ఇట్టే వైరల్ అవుతుంటాయి. అంతమంది ఫాలోవర్స్ ఉంటారు మరి. మిలియన్ల ఫాలోవర్స్ పెరిగే కొద్దీ.. వారి ఆదాయం కూడా పెరుగుతుంది. ఫాలోవర్స్ ను బట్టి.. కమర్షియల్ పోస్టులకు లక్షల్లో అమౌంట్ డిమాండ్ చేస్తున్నారు. హీరోల కంటే.. గ్లామరస్ హీరోయిన్లకే ఫాలోవర్స్ ఎక్కువ అన్న విషయం తెలిసిందే. తాజాగా టాలీవుడ్ హీరో అక్కినేని నాగచైతన్య ఇన్ స్టా గ్రామ్ లో ఏడు మిలియన్ల ఫాలోవర్స్ ను సంపాదించుకుని, 7 మిలియన్ ఫ్యామిలీలో చేరిపోయాడు.

చైతన్య ఇటీవలే.. అమీర్ ఖాన్ హీరోగా రూపొందిన 'లాల్ సింగ్ చద్దా'లో కీలక పాత్ర పోషించాడు. బాలీవుడ్ ఎంట్రీతోనే చైతన్య ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగినట్లు తెలుస్తోంది. కానీ.. ఇప్పటి వరకూ చైతన్య ఇన్ స్టా 59 పోస్టులు మాత్రమే చేశారు. ఏదేమైనా.. సోషల్ మీడియాను అవసరానికి మించకుండా వాడే మన నాగచైతన్య 7 మిలియన్ల ఫాలోవర్స్ ను సంపాదించాడంటే గ్రేటే కదా! ఇక అక్కినేని నాగార్జున రెండో కొడుకు అఖిల్ కు సోషల్ మీడియాలో ఫాలోవర్స్ తక్కువనే చెప్పాలి. ఇన్ స్టాలో అతన్ని 2.6 మిలియన్ల మంది ఫాలో అవుతుంటే, ట్విట్టర్ లో 2.9 మిలియన్లు ఫాలో అవుతున్నారు. కింగ్ నాగార్జున ఇన్ స్టాగ్రామ్ లో లేరు. ట్విట్టర్ లో ఆయన్ని 6.3 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు.



Tags:    

Similar News