హాలీవుడ్ రేంజి యాక్షన్ మూవీ.. ఏజెంట్

అక్కినేని అఖిల్.. హీరోగా నటిస్తున్న సినిమా ఏజెంట్. అఖిల్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘ఏజెంట్’.

Update: 2022-07-15 12:31 GMT

అక్కినేని అఖిల్.. హీరోగా నటిస్తున్న సినిమా ఏజెంట్. అఖిల్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ 'ఏజెంట్'. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈ సినిమాలో అఖిల్ 'రా' ఏజెంట్ పాత్రలో కనిపించనున్నాడు. ఈ సినిమా కోసం అఖిల్ చాలా కష్టపడ్డాడని పోస్టర్స్ చూడగానే అర్థం అవుతుంది. సినిమా అవుట్ పుట్ బాగా రావడానికి అఖిల్ అందుకోసం రెమ్యునరేషన్ తీసుకోలేదు. తాజాగా సినిమా టీజర్ విడుదలైంది. తెలుగు, మలయాళ టీజర్‌ను అఖిల్, మమ్ముట్టి విడుదల చేయగా, తమిళంలో శివ కార్తికేయన్, కన్నడ వెర్షన్ టీజర్‌ను కిచ్చా సుదీప్ విడుదల చేశారు. హీరోగా వరుస పరాజయాల్లో ఉన్న అఖిల్ అక్కినేనికి 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' సినిమాతో కథానాయకుడిగా తొలి సక్సెస్‌‌‌ను అందుకున్నారు. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాలో సాప్ట్ రోల్లో కనిపించిన అఖిల్.. ఇపుడు ఏజెంట్ సినిమా కోసం ఫుల్ గా బాడీ పెంచి.. యాక్షన్ గేర్ వేసేశాడు. టీజర్ లో రిచ్ నెస్, యాక్షన్ ఎపిసోడ్స్ ను బాగా చూపించారు.

వక్కంతం వంశీ కథ అందించిన ఈ సినిమాలో అఖిల్ సరసన సాక్షి వైద్య కథానాయికగా నటిస్తోంది. ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్, సురేందర్ 2 సినిమా పతాకాలపై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రానికి హిప్ హాప్ తమిళ సంగీతం అందించారు. రసూల్ ఎల్లోర్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. జాతీయ అవార్డు గ్రహీత నవీన్ నూలి ఎడిటర్‌గా, అవినాష్ కొల్లా ఆర్ట్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. అజయ్ సుంకర, పతి దీపా రెడ్డి ఈ చిత్రానికి సహ నిర్మాతలుగా వ్యవహరిస్తూ ఉన్నారు.


Full View


Tags:    

Similar News