ఓటీటీల్లో భారీ సినిమాలు.. స్మాల్ స్క్రీన్ ప్రేక్షకులకు పండగే !

డిసెంబర్ లో విడుదలైన కొన్ని క్రేజీ, భారీ చిత్రాలు ఓటీటీ విడుదలకు రెడీ అయ్యాయి. స్మాల్ స్క్రీన్ ప్రేక్షకులకు భారీ సినిమాలు వినోదాన్ని

Update: 2022-01-19 06:20 GMT

ఈ సంక్రాంతికి బంగార్రాజు మినహా.. పెద్దగా చెప్పుకోదగ్గ సినిమాలేవీ విడుదల కాలేదు. విడుదల కావాల్సిన భారీ ప్రాజెక్టులన్నీ వరుసగా వాయిదా పడ్డాయి. దాంతో బంగార్రాజుకు ఊహించని కలెక్షన్లొచ్చాయి. డిసెంబర్ ఫస్ట్ వీక్ లో విడుదలైన బాలయ్య అఖండ, పుష్ప సినిమాలు సంక్రాంతికి కూడా భారీ వసూళ్లు రాబట్టాయి. ఇక ఈ వీక్ కూడా థియేటర్లలో కొత్త సినిమాల విడుదలలు పెద్దగా కనిపించడం లేదు. కానీ.. డిసెంబర్ లో విడుదలైన కొన్ని క్రేజీ, భారీ చిత్రాలు ఓటీటీ విడుదలకు రెడీ అయ్యాయి. స్మాల్ స్క్రీన్ ప్రేక్షకులకు భారీ సినిమాలు వినోదాన్ని అందించనున్నాయి.

ఇప్పటికీ థియేటర్లలో దుమ్మురేపుతోన్న అఖండ సినిమా.. మరో రెండ్రోజుల్లో అనగా జనవరి 21వ తేదీన అఖండ ఓటీటీలో విడుదల కానుంది. బాలకృష్ణ – బోయపాటి హ్యాట్రిక్ మూవీగా థియేటర్స్ కి వచ్చి 100 కోట్లను ఈజీగా క్రాస్ చేసేసిన అఖండ హాట్ స్టార్ లో స్ట్రీమ్ కాబోతుంది. ఇక నేచురల్ స్టార్ నానికి చాలా గ్యాప్ తర్వాత సౌత్ లాంగ్వెజెస్ అన్నింట్లో రిలీజై హిట్ అందించిన సినిమా శ్యామ్ సింగరాయ్. నాని డ్యూయల్ రోల్, సాయిపల్లవి, కృతిశెట్టి హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమాకు రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వం వహించారు. డిసెంబర్ 2021 ఎండింగ్ విడుదలైన ఈ సినిమా మంచి వసూళ్లే రాబట్టింది. ఈ సినిమా జనవరి 21 నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అయ్యేందుకు సిద్ధమైంది. ఈ వారం నెట్ ఫ్లిక్స్ చాలా కొత్త కంటెంట్ ను ఇంట్రడ్యూస్ చేయబోతుంది. ది పప్పట్ మాస్టర్ షో తో పాటూ టూ హాట్ టు హ్యాండిల్ సీజన్ 3కి ఈ ఫ్రైడే వెల్కమ్ చెబుతోంది. రొమాంటిక్ కామెడీ ది రాయల్ ట్రీట్ మెంట్.. హిస్టారికల్ థ్రిల్లర్ మునిచ్.. ది ఎడ్జ్ ఆఫ్ వార్… ఓజార్క్ సీజన్ 4, సమ్మర్ హీట్.. ఇలా ఈ వీక్ ఫుల్ హాట్ కంటెంట్ తో హల్చల్ చేయబోతుంది నెట్ ఫ్లిక్స్.
హౌ ఐ మెట్ యువర్ ఫాదర్ షోతో పాటూ బిలియన్స్ సీజన్ 6 షో హాట్ స్టార్ లో 21న రిలీజ్ కాబోతుంది. అన్ పాజడ్ నయా సఫర్, ఎ హీరో వంటి సినిమాలతో ప్రైమ్ ఎంగేజ్ చేయబోతుంది. సోనీలివ్ లో భూతకాలమ్, జీ5లో లూజర్ సీజన్2, ముదాల్ నీ ముదివమ్ నీ వంటి ప్రాజెక్ట్స్ కూడా ఈ వారమే వచ్చేస్తున్నాయి. మొత్తానికి స్మాల్ స్క్రీన్ ప్రేక్షకులకు ఈవారం కావాల్సినంత వినోదాన్ని పంచేందుకు ఓటీటీ సంస్థలు సిద్ధమయ్యాయి.


Tags:    

Similar News